
హైదరాబాద్ మార్చి 25 (జనంసాక్షి):
హైదరాబాద్-రంగారెడ్డి, మహబూబ్‌నగర్ నియోజకవర్గ పట్టభద్రుల నియోజవర్గ అభ్యర్థిగా బీజేపీ ఎమ్మెల్సీ అభ్యర్థి రాంచందర్‌రావు గెలుపొందారు. 13,318 ఓట్ల మెజారిటీతో టీఆర్‌ఎస్ ఎమ్మెల్సీ అభ్యర్థి దేవీప్రసాద్‌పై ఆయన విజయం సాధించారు. తన గెలుపుపై రాంచందర్‌రావు స్పందిస్తూ… నా గెలుపు కోసం బీజేపీ నాయకులు ఎంతో శ్రమించారు. టీడీపీ, లోక్‌సత్తా పార్టీలు నా విజయం కోసం కృషి చేశాయి. ఇది ప్రభుత్వ ఓటమి. టీడీపీ లోక్‌సత్తా పార్టీలకు ధన్యవాదాలు. ఉపాధ్యాయ సంఘాలందరికీ ధన్యవాదాలు. జీహెచ్‌ఎంసీ ఎన్నికల్లో కూడా ఇదే పంథా కొనసాగిస్తాం. జనం గళాన్ని సభలో వినిపిస్తానని ఆయన పేర్కొన్నారు. కాగా కాసేపట్లో రాంచందర్‌రావు గెలుపుపై అధికారిక ప్రకటన వెలువడనుంది.




