Monday, 2 November 2026

కరువును తరిమికొడదాం

2

చెరువులు నిర్మిద్దాం

గజ్వేల్‌ సభలో సీఎం కేసీఆర్‌

 

హైదరాబాద్‌, నవంబర్‌ 30 (జనంసాక్షి) : కరువు మహమ్మారిని తరిమికొడదామని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు పిలుపునిచ్చారు. చెరువులు పునర్మిద్దామని చెప్పారు. గజ్వేల్‌ నియోజకవర్గంలోని గ్రామాలన్నింటికి మహార్దశ పట్టనుంది. ఈ మేరకు ఆదివారం సీఎం కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు గజ్వేల్‌ నియోజకవర్గంలోని ఎర్రవెల్లి గ్రామంలో నియోజకవర్గం అభివృద్ధిపై సవిూక్ష జరిపారు. ఈ కార్యక్రమానికి ప్రభుత్వాధికారులు, నియోజకవర్గం ప్రజలు హాజరయ్యారు. నియోజకవర్గంలోని గ్రామాల ప్రజలు రోడ్ల పరిస్థితిని సీఎంకు వివరించగా సీఎం అక్కడికక్కడే అధికారులను ఆదేశిస్తూ రోడ్లను మంజూరు చేశారు. ఈ పనులను గ్రామ సర్పంచులు దగ్గరుండి నాణ్యమైన పనులు జరిపించుకోవాలని కోరారు. నియోజకవర్గంలోని ప్రతీ గ్రామానికి బీటీ రోడ్లు వేయాలని అధికారులను ఆదేశించారు. భవానందాపూర్‌ మినహా నియోజకవర్గంలోని అన్ని గ్రామాలతో బీటీ రోడ్లతో అనుసంధానమై ఉన్నాయని సీఎం అన్నారు. భవానందపూర్‌కు అతి త్వరలో బీటీ రోడ్డు నిర్మాణం జరుగుతుందని స్పష్టంచేశారు. గజ్వేల్‌ నియోజకవర్గంలో మే నెలాఖరు వరకు డాంబర్‌ రోడ్డులేని గ్రామం ఉండదని వెల్లడించారు. గజ్వేల్‌లో రూ.72 రోడ్ల నిర్మాణం కోసం రూ.86కోట్లు నిధులను మంజూరు చేశారు.రోడ్ల పునరుద్దరణ పనుల్లో అధికారులకు స్థానిక సర్పంచులు, జెడ్పీటీసీలు, ఎంపీటీసీలు సహకరించాలని విజ్ఞప్తి చేశారు. నియోజకవర్గంలో 308 బ్రిడ్జిలు, కల్వర్టుల నిర్మాణానికి రూ.17.77 కోట్లు మంజూరు చేశామని తెలిపారు. గజ్వేల్‌ నుంచి ముట్రాజ్‌పల్లి విూదుగా రాజీవ్‌ రహదారి వరకు డబుల్‌ రోడ్డు వేయాలని అధికారులను ఆదేశించారు. గజ్వేల్‌ నియోజకవర్గంలో 260 కిలోవిూటర్ల ఆర్‌ అండ్‌ బీ రోడ్లు ఉన్నాయని తెలిపారు. 166 కిలోవిూటర్ల సింగిల్‌ రోడ్లను రూ.260 కోట్లతో త్వరలో డబుల్‌ రోడ్లుగా మారుస్తామని పేర్కొన్నారు. గజ్వేల్‌ నుంచి తుప్రాను రోడ్డుపై అవసరమైతే అన్ని చోట్లా హైలెవల్‌ బ్రిడ్జిలు నిర్మిస్తామని తెలిపారు. తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్‌ తన సొంత నియోజకవర్గమైన మెదక్‌ జిల్లా గజ్వేల్‌ అభివృద్ధిపై అధికారులతో సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా గజ్వేల్‌లోని సమస్యలను అడిగి తెలుసుకున్నారు. విద్యుత్‌ పరిస్థితిపై పూర్తిగా సమీక్షించిన ఆయన విద్యుత్‌ ట్రాన్స్‌ఫార్మర్లు సరఫరా చేస్తామన్నారు. గుత్తేదారులు పనిచేయకుంటే వారిని తొలగించి కొత్త వారికి ఇవ్వాలని ఆదేశించారు. గజ్వేల్‌లో విద్యుత్‌ సమస్య లేకుండా చేస్తామన్నారు. రాష్ట్రంలో కాకతీయులనాటి గొలుసుకట్టు చెరువులు సీమాంధ్రుల పాలనలో నాశనమై పోయాయని సీఎం కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు స్పష్టం చేశారు. ఇవాళ తన సొంత నియోజకవర్గం గజ్వేల్‌లో ఆయన అధికారులు, స్థానికులతో కలిసి సవిూక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా సీఎం మాట్లాడుతూ… గజ్వేల్‌ నియోజకవర్గంలో చెరువుల పునరుద్దరణను యజ్ఞంలా చేపట్టాలని పిలుపునిచ్చారు. తొలి దశలో గజ్వేల్‌లో రూ.250 కోట్లతో 604 చెరువుల్లో పూడికతీత కార్యక్రమం చేపడుతామన్నారు. ఇందు కోసం నియోజకవర్గం ప్రజలు తనకు సహకరించాలని, ప్రతీ ఒక్కరూ పాల్గొనాలని విజ్ఞప్తి చేశారు. స్వయంగా తాను కూడా చెరువుల పునరుద్దరణ శ్రమదానంలో పాల్గొంటానని తెలిపారు. మండలానికి ఒక ఊరు చొప్పున తాను ఈ శ్రమదానంలో పాల్గొంటానని పేర్కొన్నారు. గ్రామంలో ఒక్కసారి చెరువులు నిండితే మూడేండ్లదాకా కరువుకాటకాలు ఉండయని అన్నారు. చెరువుల నుంచి తీసిన పూడిక తీత మట్టిని రైతులు పొలాల్లో వేసుకోవాలని కోరారు. ఈ మట్టిని వాడితే 3 సంవత్సరాల వరకు ఎరువులు ఎక్కువగా వినియోంచకున్నా పంటలు బాగా పండుతాయని వివరించారు. దేవుడు మనకు గోదావరి నీళ్లను ఇచ్చాడని నియోజకవర్గానికంతటికి గోదావరి నీళ్లు అందేలా చేపట్టే ప్రాజెక్టుకు త్వరలోనే శంకుస్థాపన చేస్తానని తెలిపారు. ప్రాణహిత-చేవెళ్ల నుంచి లక్షా 40 ఎకరాలకు సాగునీరు తెస్తామన్నారు. పాములపర్తి దగ్గర రూ.5 వేల కోట్లతో 10 టీఎంసీల కెపాసిటీతో రిజర్వాయర్‌ నిర్మింపజేస్తామని ప్రకటించారు.

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *