Wednesday, 4 November 2026

కరెంటు కష్టాలు గట్టెక్కించండి

3

వాటా విద్యుత్‌ రప్పించడంలో సర్కారు విఫలం-జానారెడ్డి

హైదరాబాద్‌,జనవరి17(జనంసాక్షి): తెలంగాణ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్రావు జిల్లాలు పర్యటించేందుకే పదవిలోకి వచ్చినట్టుంది’ అని ప్రతిపక్షనేత కె.జానారెడ్డి ఎద్దేవా చేశారు. జిల్లాల పర్యటననే డ్యూటీగా భావిస్తున్నారని జానా విమర్శించారు. శనివారం ఆయన విూడియాతో మాట్లాడుతూ.. హావిూలు ఇవ్వాలనుకుంటే హైదరాబాద్‌  నుంచి ఇవ్వవచ్చు. అయినా కేసీఆర్‌  జిల్లాలు పర్యటిస్తున్నారు. నల్లగొండ, ఖమ్మం జిల్లాలకు రబీకి నీళ్లిచ్చే అంశంపై ఇప్పటికీ ప్రభుత్వం నుంచి ఎలాంటి స్పందన లేదు. రబీకి నీళ్లిస్తారని ప్రజలు ఎదురుచూస్తున్నారు. కానీ ప్రభుత్వం అందుకు విరుద్ధంగా నడుస్తోంది. కృష్ణపట్నం విద్యుత్‌ కోసం కేంద్రంపై ఒత్తిడి తేవాల్సిన బాధ్యత కేసీఆర్‌ పై ఉంది. రాష్ట్రం ఉమ్మడిగా ఉన్నప్పుడు కూడా రెండో పంటకు నీరు అందించారు. ఇప్పుడెందుకు స్పందించడం లేదని ఆయన ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. ప్రజలకు ఎన్ని గంటలు కరెంటు ఇస్తారో  కడా ముఖ్యమంత్రి స్పష్టం చేయాలని డిమాండ్‌ చేశారు. వేసవి రాకముందే జనవరి నుంచే విద్యుత్‌ కోతలు మొదలయ్యాయని విమర్శించారు. ఛత్తీస్‌గఢ్‌ నుంచి విద్యుత్‌ తెస్తామని ఎంఓయూ ఒప్పందం కుదుర్చుకుని మూడు నెలలవుతున్నా ఇంత వరకు అందుకు సంబంధించిన పనులు ప్రారంభం కాలేదని అన్నారు. తెలంగాణకు విభజన చట్టం ప్రకారం కృష్ణపట్నం నుంచి రావాల్సిన విద్యుత్‌ వాటాను ఇవ్వకుండా చంద్రబాబు అడ్డుపడుతుంటే కేసీఆర్‌ కనీసం మాట్లాడటం లేదన్నారు. ఇప్పటికైనా కేసీఆర్‌ నిద్రలేవాలని సూచించారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *