Wednesday, 4 November 2026

నా వర్గ ప్రజలను హతమారుస్తున్నందుకే సిరియా వెళ్లాలనుకున్నా

4

ఇంజనీర్‌ సల్మాన్‌ మొయినుద్దీన్‌

ఆలోచనను నేరంగా ఎలా పరిగణిస్తారు-మొయినుద్దీన్‌ తండ్రి

హైదరాబాద్‌, జనవరి17(జనంసాక్షి): అమెరికా పోలీసుల కళ్లుగప్పి ఉగ్రవాద కార్యకలాపాలు నెరపుతున్న హైదరాబాద్‌ యువకుడు సల్మాన్‌ మొయినుద్దీన్‌ ఐఎస్‌ఐఎస్‌ గురించి మరిన్ని విషయాలు చెప్పాడు. తన వర్గం వాళ్లను కాపాడుకునేందుకే సిరియా బయలుదేరినట్లు అతను పోలీసు విచారణలో తెలిపాడు. తన వర్గం ప్రజలను అన్యాయంగా హతమారుస్తుంటే చూస్తూ ఊరుకోలేకనే సిరియా వెళ్లేందుకు నిర్ణయించుకున్నట్లు స్పష్టంచేశాడు. అమెరికా అధికారులు తన వీసా గడువు పెంచకుండా వెనక్కి పంపారని.. సందర్శక వీసాపైనే దుబాయ్‌ వెళ్తున్నానని తెలిపాడు. దుబాయ్‌లో ప్రియురాలిని పెళ్లాడి సిరియా వెళ్లాలని భావించినట్లు వెల్లడించాడు. |లాన్‌ న్యూస్‌ అనే ఫేస్‌బుక్‌ అకౌంట్‌ ద్వారా ఐఎస్‌పై ప్రచారం చేసినట్లు చెప్పాడు. |లాన్‌ న్యూస్‌లో చాలామంది చేరారని తెలిపాడు. సల్మాన్‌ మొయినుద్దీన్‌ను గురువారం రాత్రి శంషాబాద్‌ విమానాశ్రయంలో పోలీసులు అదుపులోకి తీసుకున్న విషయం తెలిసిందే. మొయినుద్దీన్‌ ల్యాప్‌టాప్‌ను సైబరాబాద్‌ పోలీసులు పరిశీలిస్తున్నారు. మొయినుద్దీన్‌ ఫేస్‌బుక్‌, ట్విట్టర్‌లో ఉన్న వాళ్లనూ పోలీసులు ప్రశ్నించనున్నారు.  మరోవైపు మొయినుద్దీన్‌ తండ్రి మాత్రం తన కొడుకు ఎలాంఠి నేరానికి పాల్పడలేదని చెప్తున్నారు. చట్ట ప్రకారమే తన కొడుకు అన్ని అనుమతులతో దుబయ్‌ వెళ్లేందుకు సిద్ధమయ్యాడని పేర్కొన్నారు. ఎలాంటి మారణాయుధాలు లేకున్నా తన కొడుకును అక్రమంగా అరెస్టు చేశారని అన్నారు. ఐఎస్‌ఐఎస్‌ భారత్‌లో నిషేధిత సంస్థ కాదని, దాని గురించి ఆలోచించడం నేరమెలా అవుతుందని ఆయన ప్రశ్నిస్తున్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *