Thursday, 5 November 2026

కరెంటు కోతలు లేనట్టే!

cmxt73mzహైద‌రాబాద్ జ‌నంసాక్షి

ముఖ్యమంత్రి కేసీఆర్ కృషి ఫలించింది. విద్యుత్ కోతలు లేని రాష్ట్రంగా తెలంగాణను తీర్చిదిద్దాలన్న ముఖ్యమంత్రి సంకల్పం నెరవేరింది. హర్యానా ఝజ్జర్‌లోని ఆరావళి పవర్ కంపెనీ నుంచి రాష్ట్రానికి విద్యుత్ కేటాయిస్తూ కేంద్రం నిర్ణయం తీసుకుంది. ఈ ఏడాది ఏప్రిల్ 1 నుంచి సెప్టెంబర్ 30 వరకు తెలంగాణకు 222 మెగావాట్ల విద్యుత్ అందుతుంది. ఆ తర్వాతి తేదీ నుంచి 2016 మార్చి 31 వరకు 374 మెగావాట్ల విద్యుత్ ను కేంద్రం రాష్ట్రానికి కేటాయిస్తుంది. తెలంగాణలో కరెంట్ కోతలు లేకుండా చూసేందుకు సీఎం కేసీఆర్ ఇప్పటికే పలుమార్లు కేంద్రంతో చర్చలు జరిపారు. వాటి ఫలితంగానే ఇప్పుడు కేంద్రం విద్యుత్ను కేటాయించింది. సీఎం చెప్తున్నట్టు ఈ వేసవిలో ఇక కరెంట్ కోతలు లేనట్టే!

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *