Thursday, 5 November 2026

బీసీ ఉప ప్రణాళిక పరిశీలనలో ఉంది : జోగురామన్న

prsibbc8హైదరాబాద్‌ : తెలంగాణలో బీసీ ఉప ప్రణాళిక అంశం ప్రభుత్వ పరిశీలనలో ఉందని మంత్రి జోగురామన్న తెలిపారు. శాసనసభలో ప్రశ్నోత్తరాల సందర్భంగా మంత్రి ఈ అంశంపై మాట్లాడారు. బీసీ కులాల ఆర్థిక స్థితిగతులపై అధ్యయనం చేస్తామని వెల్లడించారు. అంతకుముందు ఇదే అంశంపై భాజపా ఎమ్మెల్యే కిషన్‌రెడ్డి మాట్లాడారు. చిన్న చిన్న కులాలకు ప్రభుత్వ ప్రోత్సాహం కరువైందని అన్నారు. బీసీ ఉపప్రణాళికపై చట్టాన్ని ఎప్పటిలోగా చేస్తారని ప్రశ్నించారు. సమగ్ర సర్వేలో 52 శాతం బీసీలు ఉన్నట్లు తెలుస్తోందని కాంగ్రెస్‌ నేత భట్టి విక్రమార్క అన్నారు. వచ్చే సమావేశాల్లోగా చట్టం తేవాలని కోరుతున్నట్లు పేర్కొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *