Tuesday, 3 November 2026

కర్నాటక అక్రమ ప్రాజెక్టులపై కేంద్రానికి ఫిర్యాదు

nut3cgpkహైదరాబాద్ : కృష్ణానదిపై కర్నాటక రాష్ట్రం అక్రమంగా నిర్మిస్తొన్న ప్రాజెక్టులపై తెలంగాణ ప్రభుత్వం కేంద్రానికి ఫిర్యాదు చేసింది. రెండు టిఎంసీల సామర్థ్యం…194 గేట్లతో రాయచూర్ జిల్లా గిరిజాపూర్‌ దగ్గర అక్రమంగా నిర్మిస్తోన్న ప్రాజెక్టు వల్ల మహబూబ్‌నగర్ జిల్లాలోని ప్రియదర్శిని జూరాల ప్రాజెక్టు భవితవ్యం ప్రశ్నార్థకంగా మారనుందని కేంద్ర జలసంఘానికి లేఖ రాసింది.కృష్ణా ట్రిబ్యునల్‌ అనుమతివ్వని ఆ ప్రాజెక్టును తక్షణం ఆపకపోతే తెలంగాణకు తీరని నష్టం జరుగుతుందని ఆందోళన వ్యక్తం చేసింది.కర్ణాటక అక్రమ ప్రాజెక్టులపై సుప్రీంకోర్టులో కేసు నడుస్తుందని గుర్తు చేస్తూ తెలంగాణ నీటి పారుదల శాఖ కార్యదర్శి ఎస్.కే జోషి.. కేంద్ర జలసంఘం, కేంద్ర జలవనరుల శాఖకు లేఖలు రాసారు.గిరిజాపూర్ ప్రాజెక్టు సమగ్ర వివరాలను ఆయన లేఖలో ప్రస్తావించారు. అనుమతులు లేకున్నా ప్రాజెక్టును ఎలా నిర్మిస్తున్నారన్న విషయంతో పాటు ఆల్మట్టి ఎత్తు పెంపుతో తెలంగాణలోని జురాలతో పాటు ఇతర ప్రాజెక్టులకు జరగనున్న నష్టాన్ని లేఖలో వివరించారు. తక్షణం జోక్యం చేసుకుని అక్రమ ప్రాజెక్టును నిలిపివేయాలని జోషి కోరారు.గిరిజ్‌పూర్ బ్యారేజీ పొడవు ఒక వెయ్యి 170 మీటర్లలో కర్ణాటక ప్రాజెక్టు నిర్మిస్తోంది. మొత్తం 194 గేట్లను నిర్మిస్తోంది. 2 టీఎంసీల నీరు నిలువ చేసేందుకు ఉద్దేశించిన ఈ ప్రాజెక్టును రెండేళ్లలో పూర్తి చేయాలని కర్ణాటక నిర్ణయించింది. మరి కర్నాటక అక్రమాలపై తెలంగాణ ప్రభుత్వం అభ్యంతరాలను కేంద్ర జలసంఘం ఎంతమేరకు స్పందిస్తుందో చూడాలి

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *