కర్నూలు టీడీపీలో లోకేష్ చిచ్చు
– అభ్యర్ధుల ప్రకటనపై టీజీ వెంకటేశ్ అసంతృప్తి
– లోకేష్‌ను హిప్నోటైస్ చేశారంటూ వ్యంగ్యాస్త్రాలు
అమరావతి, జులై11(జనం సాక్షి) : తెలుగుదేశం పార్టీలో విభేదాలు మరోసారి భగ్గుమన్నాయి. ఇటీవల కర్నూలు జిల్లా పర్యటనలో మంత్రి నారా లోకేష్ తెలుగుదేశం పార్టీ తరపున కర్నూలు ఎమ్మెల్యే, ఎంపీల అభ్యర్థుల పేర్లు ప్రకటించారు. ఈనేపథ్యంలో ఒక్కసారిగా జిల్లాలో రాజకీయ వేడి రాజుకుంది. దీంతో ఆ రెండు స్థానాలకు టికెట్లు ఆశిస్తున్న వారిలో అసంతృప్తి రేగింది. వివరాల్లోకి వెళ్తే.. కర్నూలు జిల్లా పర్యటన సందర్భంగా ఓ అధికారిక కార్యక్రమంలో మంత్రి నారా లోకేష్, రానున్న ఎన్నికల్లో కర్నూలు ఎమ్మెల్యేగా ఎస్వీ మోహన్ రెడ్డి, ఎంపీగా వైఎస్సార్సీపీ ఫిరాయింపు ఎంపీ బుట్టారేణుక పోటీ చేస్తారంటూ ప్రకటించారు. అయితే చాలా కాలంగా ఆ రెండు స్థానాలు తమవే అనుకుంటున్న టీజీ వెంకటేష్‌కు లోకేష్ ప్రకటన రుచించలేదు. దీంతో ఆయన వర్గంలో తీవ్ర అసంతృప్తి చెలరేగింది. ప్రస్తుతం రాజ్యసభ సభ్యుడుగా కొనసాగుతున్నా.. ప్రత్యక్ష ఎన్నికల్లో పోటీ చేయాలని భావిస్తున్నారు. ఈ నేపథ్యంలోనే ఎంపీ ఎమ్మెల్యే స్థానాలపై టీజీ అండ్ కో ఆశలు పెట్టుకుంది. అయితే అకస్మాత్తుగా మంత్రి 2019 ఎన్నికల్లో అభ్యర్థులు వీళ్లేనంటూ ప్రకటించడంతో టీజీ తీవ్ర అసహనానికి గురయ్యారు. ఈ మేరకు బుధవారం ఆయన స్పందించారు. మంత్రి చేసిన వ్యాఖ్యలను బహిరంగంగానే వ్యతిరేకిస్తూ విమర్శలు ఎక్కుపెట్టారు. ప్రభుత్వ అధికారిక కార్యక్రమంలో అభ్యర్థులను ఎలా ప్రకటిస్తారన్నారు. మంత్రి ప్రకటన తమను ఆశ్చర్యానికి గురిచేసిందని, లోకేష్ తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు కాదని, ముఖ్యమంత్రి కూడా కాదని అలాంటిది అభ్యర్థుల పేర్లు ఎలా ప్రకటిస్తారంటూ పేర్కొన్నారు. లోకేష్ ఏ ప్రాతిపదికన అభ్యర్థలను నిర్ణయించారో తనకు అంతపట్టడం లేదని అన్నారు. తెలుగుదేశం పార్టీకి అర్ధరాత్రి నిర్ణయాలు తీసుకుంటుందని.. మంత్రి నిర్ణయం కూడా ఇలాంటిదేమోనని ఎద్దేవా చేశారు. ఎస్వీ మోహన్ రెడ్డి ఏమైనా చేయగలరని.. అదే విధంగా లోకేష్‌ను ఎమైనా హిప్మోటైస్ చేశారేమో అంటూ టీజీ వెంకటేష్ వ్యాంగ్యాస్త్రాలు సంధించారు. సర్వేలో అనుకూలంగా ఉన్నవారికే టికెట్లు ఇస్తామని ముఖ్యమంత్రి తనతో చాలాసార్లు చెప్పారని అన్నారు. ఎమ్మెల్యే, ఎంపీ అభ్యర్థులపై చంద్రబాబు తుది నిర్ణయం తీసుకుంటారని, అప్పుడు వీటిపై స్పందిస్తానని టీజీ పేర్కొన్నారు.
జాతీయ కార్యదర్శి ¬దాలోనే అభ్యర్థులను ప్రకటించారు – ఎస్వీ మోహన్‌రెడ్డి
మంత్రి నారా లోకేష్‌ను హిప్నటైజ్ చేశారని రాజ్యసభ సభ్యుడు టీజీ వెంకటేష్ చేసిన వ్యాఖ్యలపై కర్నూలు ఫిరాయింపు ఎమ్మెల్యే ఎస్వీ మోహన్‌రెడ్డి కౌంటరిచ్చారు. బుధవారం విూడియాతో మాట్లాడుతూ.. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు చెప్పిందే లోకేష్ ప్రకటించారన్నారు. రాజకీయాల్లో లోకేష్ ఓ కొత్త పంథాను అనుసరిస్తున్నారని, టీడీపీ జాతీయ కార్యదర్శి ¬దాలోనే ఆయన కర్నూలు ఎంపీ, ఎమ్మెల్యే అభ్యర్థులను ప్రకటించారని స్పష్టం చేశారు. ఎమ్మిగనూరులో కూడా ఎమ్మెల్యే అభ్యర్థి జయనాగేశ్వర రెడ్డేనని లోకేష్ ప్రకటించినట్లు ఎస్వీ మోహన్ రెడ్డి పేర్కొన్నారు. ముందస్తు అభ్యర్థుల ప్రకటన వల్ల గెలుపు అవకాశాలు పెరుగుతాయని అభిప్రాయపడ్డారు. గతంలో టీజీ వెంకటేష్‌కు ఎంపీ పదవి, తనకు ఎమ్మెల్యే స్థానం ఇవ్వాలని పార్టీ నిర్ణయించిందని, ఈ విషయంలో తాను ఎవరిని హిప్నటైజ్ చేయలేదన్నారు. ఆ అవసరం కూడా తనకు లేదని, పార్టీ గెలుపు కోసం అందరితో కలిసి పనిచేస్తానని చెప్పారు.