Wednesday, 4 November 2026

కలాం మృతికి అసెంబ్లీ సంతాపం

b9hanqc3అసెంబ్లీ వర్షాకాల సమావేశాలు ప్రారంభమయ్యాయి. తొలి రోజు మాజీ రాష్ట్రపతి స్వర్గీయ అబ్దుల్ కలాం మృతికి శాసనసభ సంతాపం తెలిపింది. రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ సంతాప తీర్మానాన్ని ప్రవేశపెట్టారు. దేశ కీర్తి ప్రతిష్టలు సమున్నత శిఖరాలకు చేర్చేందుకు అబ్దుల్ కలాం చేసిన కృషిని సీఎం కేసీఆర్ గుర్తు చేసుకున్నారు. హైదరాబాద్లో కలాంకు విడదీయరాని అనుబంధముందని సీఎం తెలిపారు. కలాం మృతి పట్ల తెలంగాణ ప్రభుత్వం, తెలంగాణ ప్రజల తరపున సీఎం కేసీఆర్ ప్రగాఢ సానుభూతిని ప్రకటించారు. హైదరాబాద్లోని డీఆర్డీఎల్కు స్వర్గీయ అబ్దుల్ కలాం పేరు పెట్టాలని కేంద్ర ప్రభుత్వాన్ని కోరుతామన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *