Tuesday, 3 November 2026

కలెక్టరేట్‌ ముందు మెడికల్‌ షాప్‌ ఓనర్స్‌ ధర్నా

ఒంగోలు,సెప్టెంబర్‌27(జ‌నంసాక్షి): ఆన్‌లైన్‌లో మందుల అమ్మకాలను నిషేధించాలంటూ ఒంగోలులోని కలెక్టరేట్‌ వద్ద గురువారం మెడికల్‌ షాప్‌ ఓనర్స్‌ ధర్నా చేపట్టారు. ఆన్‌లైన్‌లో మందుల అమ్మకాల
ప్రతిపాదనను కేంద్ర ప్రభుత్వం తక్షణమే విరమించుకోవాలని డిమాండ్‌ చేశారు. లేని పక్షంలో ఆందోళన కార్యక్రమాలను దేశ వ్యాప్తంగా ఉద్ధృతం చేస్తామని హెచ్చరించారు. ఆన్‌లైన్‌ విక్రయాలతో ప్రజల ప్రాణౄలకు ముప్పుందన్నారు.