హైదరాబాద్, : కల్తీ కల్లు వల్ల చనిపోయినట్లుగా వస్తున్న వార్తలు అవాస్తవమని రాష్ట్ర ఎక్సైజ్ శాఖ మంత్రి పద్మారావు చెప్పారు. కల్లుకు బానిసలై చనిపోలేదని మంత్రి పేర్కొన్నారు. కల్లీ కల్లు కాటుకు తెలంగాణలో మరణిస్తున్నా అవి వాస్తవం కాదని మంత్రి ప్రకటించడం విశేషం. గీత కార్మికులకు ఇచ్చే పెన్షన్‌ను రూ.200 నుంచి వెయ్యికి పెంచామన్నారు. చనిపోయిన గీత కార్మికులకు ఇచ్చే ఎక్స్‌గ్రేషియాను రూ.5లక్షలకు పెంచామన్నారు. శాశ్వత వైకల్యం పొందిన వారికి రూ.5లక్షల ఎక్స్‌గ్రేషియా ఇస్తామని మంత్రి ప్రకటించారు.
కల్తీ కల్లుతో మరణించారన్నది అవాస్తవం – మంత్రి పద్మారావు




