Monday, 2 November 2026

కల్పనా చావ్లాగా ప్రియాంక చోప్రా

బాలీవుడ్ లో మరో బయోపిక్ తెరకెక్కడానికి రెడీ అవుతోంది. భారతదేశపు కీర్తిని అంతరిక్షంలో చాటిన విఖ్యాత వ్యోమగామి కల్పనా చావ్లా జీవిత చరిత్రను వెండితెరపైకి తీసుకురానున్నారు. ఈ సినిమాలో కల్పన పాత్రను పోషించనుంది బాలీవుడ్ ముద్దుగుమ్మ ప్రియాంక చోప్రా. ఇప్పటికే బాక్సింగ్ క్వీన్ మేరీ కోమ్ పాత్రలో నటించి విమర్శకుల ప్రశంసలు అందుకుంది. ప్రియాంక ప్రస్తుతం క్వాంటికో టీవీ సిరీస్ లో నటిస్తోంది. అలాగే తాను నటించిన బేవాచ్ ప్రమోషన్స్ లో భాగంగా అమెరికాలో ఉంది ప్రియాంక. చాన్నాళ్లుగా పెండింగ్ లో ఉన్న ఈ ప్రాజెక్టును ఇప్పుడు మళ్లీ పట్టాలెక్కించడానికి రెడీ అవుతున్నారు. ఈ సినిమాకు సంబంధించిన ప్రీ ప్రొడక్షన్ కార్యక్రమాలు పూర్తయ్యాయట. కొత్త దర్శకురాలు ప్రియా మిశ్రా దీన్ని డైరెక్ట్ చేయనున్నారు. కొత్త నిర్మాణ సంస్థ నిర్మాణ కార్యక్రమాలు చూడనుంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *