కల్వర్టును ఢీకొని యువకుడి మృతి
పశ్చిమగోదావరి: పని ముగించుకొని బైక్పై ఇంటికి వెళ్తున్న యువకుడు కల్వర్టును ఢీకొని మృతిచెందాడు. ఈ సంఘటన పశ్చిమగోదావరి జిల్లా పెంటపాడు మండలం రాచర్ల గ్రామ శివారులో శనివారం అర్ధరాత్రి జరిగింది.
గ్రామానికి చెందిన ఉమ్మిడి శ్రీనివాస్(28) ట్రాక్టర్ డ్రైవర్గా పని చేసుకుంటూ జీవనం సాగిస్తున్నాడు. ఈ క్రమంలో శనివారం పని మీద పెంటపాడు వెళ్లి తిరిగి వస్తున్న సమయంలో గ్రామశివారులోని కల్వర్టును ఢీకొని మరణించాడు. ఆదివారం ఉదయం గుర్తించిన స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.