Tuesday, 3 November 2026

కళానికేతన్‌ డైరెక్టర్‌కు 14రోజుల రిమాండ్‌

ధర్మవరం: కళానికేతన్‌ డైరక్టర్‌ లక్ష్మిశారదను దర్మవరం పట్టణ పోలీసులు నిన్న హైదరాబాద్‌లో అరెస్టు చేసి అనంతపురం జిల్లా ధర్మవరం తరలించారు. మంగళవారం ఉదయం ల క్ష్మీశారదను ధర్మవరం మేజిస్ట్రేట్‌ లీలావతి ఎదుట హజరు పరచగా ఈనెల 20వ తేది వరకు 14 రోజుల రిమాండ్‌ విధించారు. దీంతో ఆమెను దర్మవరం నుంచి అనంతపురం జిల్లా కారాగారానికి తరలించారు.

దర్మవరంలోని పట్టుచీరల వ్యాపారుల నుంచి చీరలు కొనుగోలు చేసి డబ్బు చెల్లించలేదని వ్యాపారులు ఈ ఏడాది జనవరి 11న పోలీసులకు ఫిర్యాదు చేశారు. అప్పటి నుంచి పోలీసులు లక్ష్మి శారద కోసం గాలిస్తున్నారు. హైదరాబాద్‌లోని పిల్మ్‌నగర్‌లో ఉన్నట్లు సమాచారం తెలుసుకున్న ధర్మవరం పోలీసులు ఎట్టకేలకు అమెను అరెస్టు చేశారు.

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *