Wednesday, 4 November 2026

కస్తూర్బా స్కూల్‌లో కలుషితాహారం తిని 15 మంది అస్వస్థత

చిత్తూరు, ఏప్రిల్‌ 6 : జిల్లాలోని రామసముద్రం మండలం డిన్నపల్లి కస్తూర్బా స్కూల్‌లో కలుషిత ఆహారం తిని 15 మంది విద్యార్థినులు అస్వస్థతకు గురయ్యారు. అస్వస్థతకు గురైన వారిని స్కూలు ఉపాధ్యాయులు ఆసుపత్రికి తరలించారు. వైద్యాధికారులు విద్యార్థినులకు చికిత్స చేస్తున్నారు. విద్యార్థినులు కోలుకుంటున్నారని వైద్యాధికారులు చెప్పారు. కలుషిత ఆహారం సంఘటనపై విద్యాశాఖ ఉన్నతాధికారులు విచారణ జరుపుతున్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *