Wednesday, 4 November 2026

కాచీగూడ-టాటా నగర్‌ మధ్య ప్రత్యేక రైలు

విశాఖపట్నం,ఆగస్ట్‌25(జ‌నం సాక్షి): సింహాచలం నార్త్‌, దువ్వాడ విూదుగా కాచీగూడ, టాటానగర్‌ మధ్య ప్రత్యేక రైలు సర్వీసులు అందుబాటులోకి వచ్చాయని వాల్తేరు డివిజన్‌ సీనియర్‌ డీసీఎం జి.సునీల్‌కుమార్‌ తెలిపారు. 07438 నంబరు ప్రత్యేక రైలు అక్టోబరు 29వ తేదీ వరకు ప్రతి సోమవారం మధ్యాహ్నం 1 గంటకు కాచీగూడలో బయలుదేరి.. సోమవారం అర్ధరాత్రి ఒంటి గంటకు దువ్వాడ చేరి తిరిగి 1.02 గంటలకు బయలుదేరి 1.30 గంటలకు సింహాచలం నార్త్‌ చేరుతుంది. అక్కడ నుంచి 1.35 గంటలకు బయలుదేరి అదేరోజు అంటే మంగళవారం రాత్రి 7.45 గంటలకు టాటానగర్‌ చేరుతుంది. 07439 నంబరు రైలు అక్టోబరు 30వ తేదీ వరకు ప్రతి మంగళవారం రాత్రి 10.50 గంటలకు టాటానగర్‌లో బయలుదేరి మర్నాడు మధ్యాహ్నం 2.30 గంటలకు సింహాచలం నార్త్‌కు చేరి, అక్కడ నుంచి 2.35 గంటలకు బయలుదేరి 3.15 గంటలకు దువ్వాడ చేరుతుంది. అక్కడ నుంచి 3.17 గంటలకు బయలుదేరి గురువారం ఉదయం 5.00 గంటలకు కాచీగూడ చేరుతుందని ఆయన వివరించారు.