కాలనీలో వసతులు కల్పించాలని ధర్నా

కర్నూలు,మే14(జ‌నం సాక్షి): ఆదోని పట్టణ శివారులోని ముస్లిం మైనార్టీ కాలనీలో మౌలిక వసతులు కల్పించాలంటూ సోమవారం సీపీఎం పార్టీ ఆధ్వర్యంలో కాలనీ వాసులు పురపాలక సంఘం కార్యాలయం ఎదుట ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా నాయకులు మహానందరెడ్డి మాట్లాడుతూ.. కాలనీ ఏర్పడి ఏళ్లు గడుస్తున్నా.. ఇంతవరకు మౌలిక వసతులు కల్పించలేదన్నారు. వీధి దీపాలు లేక రాత్రుళ్లూ ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. తాగునీరు, రహదారుల సమస్యలు వెంటనే పరిష్కరించాలని డిమాండ్‌ చేశారు. కార్యక్రమంలో నాయకులు తదితరులు పాల్గొన్నారు.

తాజావార్తలు