కాలనీ సమస్యలపై సిపిఎం ఆందోళన
కడప,జూలై28(జనం సాక్షి): కడప జిల్లా ద్వేలు సుందరయ్య కాలనీలో మున్సిపల్ కార్యాలయం వద్ద సిపిఎం ఆధ్వర్యంలో శనివారం ధర్నా నిర్వహించారు. కాలనీ వాసులకు వీధి లైట్లు , సిమెంట్ రోడ్లు , తాగునీటి వసతి సంబంధిత మౌలిక సదుపాయాలు కల్పించాలంటూ సిపిఎం నాయకులు డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో సిపిఎం నాయకులు ప్రభాకర్ రెడ్డి , పివి రమణ , పి వెంకట రమణ, చాంద్బాషా , నాగరాజు, చిన్ని ప్రవీణ్ , షరీఫ్, భారీ సంఖ్యలో కాలనీవాసులు పాల్గొన్నారు.