కాలువకు కృతజ్ఞతలు చెప్పిన జర్నలిస్ట్ నేతలు
విజయవాడ,జూలై7(జనం సాక్షి): జర్నలిస్ట్‌లకు హౌసింగ్ స్కీమ్ అమలు చేస్తూ మంత్రి మండలి ఆమోదం తెలపడం పట్ల ఎపిడబ్ల్యుజెఎఫ్ హర్షం వ్యక్తం చేసింది. ఈ మేరకు శనివారం రాష్ట్ర సమాచార పౌర సంబంధాల శాఖా మంత్రి కాలవ శ్రీనివాసులును కలిసి పుష్పగుఛ్చం అందజేసిన నేతలు కృతజ్ఞతలు తెలిపారు. ఎపిడబ్ల్యుజెఎఫ్ జిల్లా అధ్యక్షులు షఫీ, జిల్లా ఉపాధ్యక్షులు రామాంజినేయులు, జిల్లా కమిటి సభ్యులు నవీన్ కుమార్, నగర కమిటి ప్రధాన కార్యదర్శి షేక్షావళితోపాటు, జిల్లా నగర కమిటి నాయకులు మర్యాదపూర్వకంగా మంత్రిని కలుసుకుని పుష్పగుచ్ఛాన్ని అందజేసి కృతజ్ఞతలు తెలిపారు. జర్నలిస్టుల సమస్యలపై సానుకూలంగా ఉన్నందుకు అభినందనలు తెలిపారు.