Tuesday, 3 November 2026

కాలువలో పడి ఇద్దరు విద్యార్థులు మృతి

పశ్చిమగోదావరి జిల్లా బుట్టాయగూడెం మండలం ఎర్రాయిగూడెం సమీపంలోని చింతలపూడి ఎత్తిపోతల పథకం కాలువలో పడి ఇద్దరు విద్యార్థులు మృతి చెందారు. ఎర్రాయిగూడెం గ్రామానికి చెందిన నాగలక్ష్మి, దొరబాబు దంపతుల కుమారులు వెంకట పవన్‌(12), కిరణ్‌(10)లు బుధవారం మధ్యాహ్నం నుంచి కనిపించ లేదు. దీంతో కుటుంబసభ్యులు వారికోసం గాలింపు చేపట్టారు. గురువారం ఉదయం కాలువలో ఇద్దరి మృతదేహాలను స్థానికులు గుర్తించి వెంటనే పోలీసులకు సమాచారం అందించారు. వీరిద్దరూ కేఆర్‌పురం గిరిజన గురుకుల పాఠశాలలో చదువుతున్నారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *