తిరుమల , జనంసాక్షి: తిరుమల తిరుపతి దేవస్థాపం పాలకమండలి మరికాసేట్లో సమావేశం కానుంది. టీటీడీ చైర్మన్ కనుమూరి బాపిరాజు ఏకపక్ష నిర్ణయాలపై ఏడుగురు బోర్డు సభ్యులు ఎదురుదాడికి సిద్ధమయ్యారు దాంతో పాలకమండలి భేటీ ప్రాధాన్యత సంతరించుకుంది. మరోవైపు బుధవారం ఉదయం బ్రేక్ దర్శనం నుంచి డ్రెస్ కోడ్ అమల్లోకి వచ్చింది.




