Wednesday, 4 November 2026

కిరణ్‌కుమార్‌ సర్కార్‌పై విరుచుకుపడ్డ భూమన కరుణాకర్‌రెడ్డి

తిరుపతి,(జనంసాక్షి): కిరణ్‌ కుమార్‌ సర్కార్‌పై స్థానిక ఎమ్మెల్యే, వైఎస్‌ఆర్‌ కాంగ్రెష్‌ పార్టీ నాయకుడు భూమన కరుణాకర్‌రెడ్డి శుక్రవారం తిరుపతిలో తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. రాష్ట్ర ప్రభుత్వం తమపై అనుసరిస్తున్న వైఖరీకి నిరసనగా తిరుపతి కరకంబాడి రహదారిపై వృధ్దులు శుక్రవారం బైటాయించి, నిర్వహించిన ధర్నాకు ఆయన మద్దతు ప్రకటించారు. గతంలో వైఎస్‌ ప్రవేశపెట్టిన సంక్షేమ సథకాలకు కిరణ్‌ సర్కార్‌ తూట్లు పొగుస్తున్నారనేందుకు వృధ్దుల ధర్నానే ఓ నిదర్శనమని భూమన వ్యాఖ్యానించారు.
ఈ సందర్భంగా వృద్దులు ప్రసంగిస్తూ గత నాలుగు నెలలుగా పెన్షన్లు అందక తీవ్ర ఇబ్బందులు పడుతున్నామని తెలిపారు. అయితే వైఎస్‌ సీఎంగా ఉన్న సమయంలో పెన్షన్లు సక్రమంగా అందేవని వృద్దులు ఈ సందర్భంగా గుర్తుచేసుకున్నారు. పెన్షన్లపై అధికారులను సంప్రదించిన సరైన స్పందన లేదని వారు ఆవేదన వ్యక్తం చేశారు. వృద్దుల ధర్నాతో తిరుపతి కరంబాడి రహదారిపై భారీగా ట్రాఫిక్‌ నిలిచిపోయింది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *