Wednesday, 4 November 2026

కిషన్ రెడ్డి పై గుర్రుమంటున్న సొంత పార్టీ నేతలు

fqduswisబీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్రెడ్డి తీరుపై సొంత పార్టీ నేతలు గుర్రుగా ఉన్నారు. ఏకపక్షంగా నిర్ణయాలు తీసుకుంటున్నాడని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. పార్టీ కార్యక్రమాల్లో తమను కలుపుకుని పోవడం లేదని పలువురు సీనియర్ నేతలు సైతం అసంతృప్తిగా ఉన్నారు. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్రెడ్డి తీరుతో ….పార్టీలో వర్గపోరు తీవ్రస్థాయికి చేరుతోంది. కిషన్రెడ్డి వైఖరితో చాలామంది నేతలు పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉంటున్నారు. ఇప్పటికే చాలామంది సీనియర్ నేతలు సైతం కనీసం పార్టీ కార్యాలయానికి కూడా రావడం లేదు. కిషన్రెడ్డి తమనెవ్వరినీ లెక్కచేయడం లేదని …. అసంతృప్తిగా ఉన్నారు. ఇష్టారాజ్యంగా నిర్ణయాలు తీసుకుంటున్నాడని వాపోతున్నారు. కిషన్రెడ్డి ఒంటెత్తు పోకడలతో రాష్ట్రంలో పార్టీకి నష్టం చేకూరుతుందని కార్యకర్తలు సైతం అభిప్రాయపడుతున్నారు.
బీజేపీ సీనియర్ నేతలు రాజేశ్వర్ రావు, ఇంద్రసేనారెడ్డిలాంటి వారు కూడా కిషన్రెడ్డి వ్యవహారశైలిపై గుర్రుగా ఉన్నారు. బహిరంగంగానే తమ అసంతృప్తిని వెళ్లగక్కుతున్నారు. తమతో రాష్ట్ర అధ్యక్షుడు ఏ విషయంపైనా చర్చించడం లేదంటున్నారు. ఇక మాజీ ఎమ్మెల్యే యెండల లక్ష్మీనారాయణ సైతం అంటీముట్టనట్లుగానే వ్యవహరిస్తున్నారు. మరికొందరు నేతలు కూడా బాహాటంగానే కిషన్రెడ్డి నాయకత్వాన్ని వ్యతిరేకిస్తున్నారు. కిషన్రెడ్డి పనితీరు నచ్చకనే నాగం జనార్ధన్ రెడ్డి,యెన్నం శ్రీనివాస్ రెడ్డి వేరు కుంపటి పెట్టినట్లు తెలుస్తోంది. వీరిద్దరూ ఓ వైపు బీజేపీలో ఉంటూనే బచావో తెలంగాణ మిషన్ ఏర్పాటు చేశారు. గతంలో వరంగల్ పార్లమెంటు నియోజకవర్గం నుంచి బీజేపీ అభ్యర్థిగా పోటిచేసిన డాక్టర్ పరమేశ్వర్ కూడా పార్టీకి రాజీనామా చేశారు. కిషన్రెడ్డి వైఖరిని వ్యతిరేకిస్తున్న చాలామంది నేతలు …పార్టీకి దూరమయ్యేందుకే సిద్ధమవుతున్నట్లు తెలుస్తోంది.
సొంతగా బీజేపీ రాష్ట్రశాఖ ఏర్పడినా కూడా ….ఆంధ్రా పార్టీలతో అంటకాగేందుకే కిషన్‌రెడ్డి మొగ్గుచూపడంపై పార్టీ శ్రేణులు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నాయి. గత ఎన్నికల్లో టీడీపీతో పొత్తు పెట్టుకుని నష్టపోయినా….చంద్రబాబుకు దాసోహమన్నట్లుగా కిషన్ రెడ్డి వ్యవహరించడంపై బీజేపీ నేతలు మండిపడుతున్నారు. తెలంగాణలోని ప్రాజెక్టులకు టీడీపీ అడుగడుగునా అడ్డు తగులుతున్నా….కిషన్‌రెడ్డి ఒక్క మాట కూడా మాట్లడకపోవడంపై ఫైర్‌ అవుతున్నారు. రాష్ట్రాభివృద్దికి అడ్డుపడుతున్న టీడీపీని విమర్శించకపోవడంతోపాటు చంద్రబాబుపట్ల కిషన్ రెడ్డి మెతక వైఖరి ప్రదర్శించడాన్ని సీనియర్ నేతలు జీర్ణించుకోలేకపోతున్నారు.
కేంద్రంలో బీజేపీ అధికారంలో ఉన్నా…. తెలంగాణ ప్రయోజనాలకోసం కిషన్ రెడ్డి ఏ మాత్రం కృషిచేయడం లేదని పార్టీ శ్రేణులు మండిపడుతున్నాయి. కేంద్రం నుంచి రాష్ట్రానికి రావాల్సిన నిధులపై ఒత్తిడి చేయడంలేదని ఫైర్ అవుతున్నాయి. తెలంగాణకు ఇచ్చిన హామీలను అమలు చేయాలని కేంద్రాన్ని కోరే అవకాశమున్నా…..చొరవ చూపడం లేదని ప్రజల నుంచి కూడా వ్యతిరేకత వ్యక్తమవుతోంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *