Tuesday, 3 November 2026

కుటుంబ పాలన అంతంకావాలి

2

కాశ్మీర్‌ ఎన్నికల ప్రచారంలో మోడీ పిలుపు

శ్రీనగర్‌, నవంబర్‌ 22 (జనంసాక్షి) : కుటుంబ పాలనను అంతంచేయాలని ప్రధాని నరేంద్రమోడీ పిలుపునిచ్చారు. కాశ్మీర్‌ ఎన్నికల ప్రచార సభలో ఆయన ప్రసంగించారు. జమ్మూకాశ్మీర్‌ ఎదుర్కొంటున్న అన్ని సమస్యలను పరిష్కరిస్తామని మోడీ హావిూ ఇచ్చారు. గుజరాత్‌లోని కచ్‌ ప్రాంతంలాగే కాశ్మీర్‌ను అభివృద్ధి చేయాలని అనుకుంటున్నానని తెలిపారు. గత పదేళ్లలో కాశ్మీర్‌ అభివృద్ధిలో వెనుకబడిందని ఆవేదన వ్యక్తం చేశారు. కాశ్మీర్‌ ప్రజలు అభివృద్ధిని కోరుకుంటున్నారని, వారి ఆకాంక్షలను నెరవేరుస్తామని ప్రకటించారు. జమ్మూకాశ్మీర్‌ అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో శనివారం కిష్టావర్‌లో నిర్వహించిన ఎన్నికల ప్రచారంలో మోడీ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. కాశ్మీర్‌పై పొగడ్తల వర్షం కురిపించారు. దేశానికంతటికీ విద్యుత్‌ అందించే శక్తి కాశ్మీర్‌కు ఉందన్నారు. ప్రధానమంత్రి పదవి చేపట్టిన తర్వాత ప్రతి నెలకు ఒకసారి ఇక్కడకు వస్తున్నానని తెలిపారు. కాశ్మీర్‌ శరణార్థుల సమస్యల పరిష్కారానికి కృషిచేస్తానని తెలిపారు. మతాన్ని రాజకీయాలతో ముడిపెట్టకూడదని, కాశ్మీర్‌ను కాశ్మీర్‌గానే పరిగణించాలన్నారు. కాశ్మీర్‌ ప్రజలు పాకిస్తాన్‌తో చర్చల విషయంతోనే అలసిపోయారని.. ఇప్పుడు అభివృద్ధిని కోరుకుంటున్నారని చెప్పారు. వారిని అభివృద్ధి బాట పట్టించేందుకు ప్రయత్నాలు చేపట్టామన్నారు. అవినీతి ప్రస్తుతం పెద్ద సమస్యగా మారిందని, అవినీతి  రహిత ప్రభుత్వం ప్రజలకు ఎంతో అవసరమని అభిప్రాయపడ్డారు. రెండు కుటుంబాలు రాష్టాన్న్రి లూటీ చేశాయని మోడీ విమర్శించారు. రాష్ట్రంలో ఆ రెండు కుటుంబాల నుంచి మాత్రమే నాయకులు వస్తున్నారని.. మిగతా కుటుంబాల్లో నాయకులు లేరా? అని ప్రశ్నించారు. ఇక దోపిడీదారుల నుంచి విముక్తి కల్పిస్తామని మోడీ స్పష్టం చేశారు. రాష్ట్రంలో మార్పునకు ఇది కీలక సమయమని,, భవిష్యత్‌ తరాలకు అభివృద్ధి చెందిన కాశ్మీర్‌ను అందించాల్సిన అవసరముందని మోడీ పేర్కొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *