Tuesday, 3 November 2026

న్యూయార్క్‌ను ముంచెత్తుతున్న మంచుతుపాను

3

10మందికిపైగా మృతి

వణుకుతున్న అగ్రరాజ్యం

న్యూయార్క్‌, నవంబర్‌ 22 (జనంసాక్షి) : న్యూయార్క్‌ను మంచుతుపాను ముంచెత్తుతోంది. ఇప్పటికి 10మందికిపైగా మృత్యువాత పడ్డారు. ఈ తుపానుతో అగ్రరాజ్యం వణుకుతోంది. అమెరికాను చలి పులి భయపిస్తోంది. అమెరికా పూర్తిగా ఫ్రీజ్‌ కావడంతో ప్రజలు చలితో గజగజ వణికిపోతున్నారు. వివిధ ప్రాంతాల్లో అత్యల్ప ఉష్ణోగ్రతలు నమోదుకావడంతో విపరీతమైన చలి, మంచుతో ప్రజలు తీవ్రంగా ఇబ్బందులు పడుతున్నారు. ఈ మంచు ప్రమాదాన్ని ఆ దేశ ప్రభుత్వం జాతీయ విపత్తుగా ప్రకటించనుంది. అమెరికాలోని న్యూయార్క్‌ సహా పలు రాషాలు గత కొద్ది రోజులుగా అత్యల్ప ఉష్ణోగ్రతలతో గజగజ వణికిపోతున్నాయి. న్యూయార్క్‌లో మంచు తుపాను కొనసాగుతోంది. బఫెల్లో నగరంలో ఏకంగా 6 అడుగుల మేర మంచు పడింది. మరో రెండు నుంచి మూడు అడుగుల మేర మంచు పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. విపరీతంగా పేరుకుపోయిన మంచు కారణంగా కొన్ని చోట్ల ఇళ్ల కప్పులు బీటలు వారుతున్నాయి. ఇళ్లు కూలిపోయే పరి/-థసితి ఏర్పడింది. రహదారులన్నీ మూసుకుపోయాయి. మంచు తుపాను కారణంగా న్యూయార్క్‌లో 10 మందికి పైగా మరణించారు. తక్కువ సమయంలో ఇంత ఎక్కువ స్థాయిలో మంచుకురవడం తమ జీవితంలో ఎప్పుడూ చూడలేదని స్థానికులు చెప్తున్నారు. సుమారు అయిదువేల మంది నేషనల్‌ గార్డ్స్‌, అధికారులు మంచు తొలగించే చర్యల్లో పాల్గొంటున్నారు. యూయార్క్‌ పశ్చిమ ప్రాంతంలోని ఎరీ కౌంటీలో 60 అడుగుల ఎత్తున మంచు పేరుకుపోయింది. న్యూయార్క్‌ గవర్నర్‌ 10 కౌంటీలలో అత్యవసర పరిస్థితిని ప్రకటించారు. మంచు గాలులకు పశ్చిమ న్యూయార్క్‌ ప్రాంతంలో నలుగురు ప్రాణాలు కోల్పోయారు. మంచు ప్రభావంతో కొన్ని ప్రాంతాల్లో సున్నా డిగ్రీల సెంటీగ్రేడ్‌ ఉష్ణోగ్రత నమోదైంది. ఇంత అత్యల్ప ఉష్ణోగ్రతలు నమోదుకావడం 1976 తర్వాత ఇదే తొలిసారి. అమెరికా వాణిజ్య రాజధాని న్యూయార్క్‌లో మంచు విపరీతంగా కురుస్తోంది. దాంతో అక్కడి ప్రభుత్వం ప్రజలను ఆదుకొనేందుకు తగిన ఏర్పాట్లుచేసింది. దీనిపై ఉన్నతాధికారులు ఎప్పటికప్పుడు సవిూక్షలు నిర్వహిస్తున్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *