కుళ్లిన చేపల అమ్మకం: ఇద్దరి లైసెన్సులు రద్దు

కాకినాడ,జూలై11(జ‌నం సాక్షి): తుని పట్టణంలోని చేపల మార్కెట్‌లో పురపాలక అధికారులు బుధవారం ఆకస్మికంగా తనిఖీలు నిర్వహించారు. కుళ్లిన చేపలను విక్రయిస్తున్న ఇద్దరు వ్యాపారులను గుర్తించి వారి లైసెన్సును రద్దు చేశారు. కుళ్లిన చేపలను స్వాధీనం చేసుకొని డంపింగ్‌ యార్డుకు తరలిస్తున్నట్లు తుని శానిటరీ ఇన్‌స్పెక్టర్‌ సత్యనారాయణ తెలిపారు. ఎవరైనా పాడైన చేపలు, మాంసం విక్రయిస్తే తమకు ఫిర్యాదు చేయాలన్నారు.