కృష్ణమ్మను తాకిన గోదావరి
విజయవాడ: ఈనెల 9న పట్టిసీమ నుంచి విడుదలైన గోదావరి జలాలు కృష్ణానదిలో ప్రవేశించాయి. ఫెర్రీ వద్ద పవిత్ర సంగమానికి చేరిన గోదావరి జలాలకు రైతులు, మహిళలు హారతులిచ్చి స్వాగతం పలికారు. పట్టిసీమ ద్వారా 2350 క్యూసెక్కుల నీరు విడుదల చేశారు. 182 కి.మీ దూరం నుంచి గోదావరి నీరు పవిత్ర సంగమంలోకి చేరాయి. ఈనెల 9న ముఖ్యమంత్రి చంద్రబాబు పట్టిసీమ నుంచి నీటిని విడుదల చేశారు.