ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ప్రదీప్‌చంద్ర పదవీకాలాన్ని పొడిగించాలని ముఖ్యమంత్రి చంద్రశేఖరరావు కేంద్రాన్ని కోరారు. ఈనెల 31వ తేదీన ప్రదీప్‌చంద్ర పదవీకాలం పూర్తవుతోంది. మరో మూడు మాసాల పాటు ఆయన పదవీకాలాన్ని పొడిగించాలని సీఎం కేసీఆర్ రాసిన లేఖను తెలంగాణ రాష్ట్ర సమితి పార్లమెంటరీ పార్టీ నేత, మహబూబ్‌నగర్ లోక్‌సభ సభ్యుడు జితేందర్‌రెడ్డి కరీంనగర్, భువనగిరి లోక్‌సభ్యులు వినోద్‌కుమార్, బూర నర్సయ్య గౌడ్ శుక్రవారం లోక్‌సభ ఆవరణలో ప్రధానమంత్రి నరేంద్రమోడీని కలిసి అందజేశారు. రాజీవ్‌శర్మ పదవీ విరమణ చేయడంతో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిగా ప్రభుత్వం ప్రదీప్‌చంద్రను నియమించిన సంగతి తెలిసిందే. మూడు మాసాల పాటు ఆయన పదవీకాలాన్ని కేంద్ర ప్రభుత్వం పొడిగిస్తే మరో మూడు మాసాలు రాష్ట్ర ప్రభుత్వం ఆయనను ఆ పదవిలో కొనసాగించే అవకాశం ఉంది. ముఖ్యమంత్రి కేసీఆర్ రాసిన లేఖపై ప్రధాని సానుకూలంగా స్పందించినట్టు ఆయనను కలిసి తెరాస ఎంపీలు అనంతరం మీడియా ప్రతినిధులతో మాట్లాడుతూ చెప్పారు.
కేంద్రానికి సీఎం కేసీఆర్ లేఖ




