తెలంగాణ శాసనసభ, శాసన మండలి సమావేశాలకు నోటిఫికేషన్ విడుదల చేశారు… ఈ నెల 15న బీఏసీ సమావేశం కానుంది. 16వ తేదీ ఉదయం 10 గంటలకు అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం కానున్నాయి. శీతాకాల సమావేశాలు ఎన్నిరోజులు నిర్వహించాలన్నదానిపై బీఏసీ సమావేశంలో నిర్ణయం తీసుకోనున్నారు. మరోవైపు ప్రజాసమస్యలపై చర్చించడానికి కనీసం 15 రోజులైనా అసెంబ్లీ సమావేశాలు నిర్వహించాలని కాంగ్రెస్ నేతలు డిమాండ్ చేస్తున్నారు.
తెలంగాణ శాసనసభ నోటిఫికేషన్ విడుదల




