హైదరాబాద్: తెలంగాణ ఐటీ, పురపాలక శాఖ మంత్రి కేటీఆర్కు శ్రీలంక ప్రభుత్వం ఆహ్వానం అందించింది. వచ్చే నెల 11, 12 తేదీల్లో కొలంబోలో నిర్వహించే హ్యూమన్ క్యాపిటల్ సమ్మిట్లో పాల్గొనాల్సిందిగా కేటీఆర్కు ఆహ్వానం పలికింది. దేశ విధానాలు, శిక్షణా కార్యక్రమాలు, ఉద్యోగాలకు యువత సంసిద్ధం అంశాలపై శ్రీలంక ప్రధాని విక్రమ సింఘేతో పాటు కేటీఆర్ ఈ సమ్మిట్లో కీలక ఉపన్యాసం చేయనున్నారు.
దీనిపై కేటీఆర్ స్పందిస్తూ.. శ్రీలంక ప్రభుత్వం నుంచి ఆహ్వానం అందడం సంతోషంగా ఉందన్నారు. రాష్ట్ర ప్రభుత్వం చేపట్టన శిక్షణ, నైపుణ్య కార్యక్రమాలను శ్రీలంకలో వివరిస్తానని స్పష్టం చేశారు.




