3 లక్షల సొత్తు స్వాధీనం
కేపీహెచ్‌బీకాలనీ: చైన్‌స్నాచర్‌ను కేపీహెచ్‌బీ పోలీసులు అరెస్టు చేశారు. అతడి వద్ద నుంచి మూడు లక్షల విలువ చేసే బంగారు ఆభరణాలను స్వాధీనం చేసుకున్నారు. పోలీస్‌స్టేషన్‌లో శుక్రవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఏసీపీ సంజీవరావు, సీఐ శ్రీకాంత్‌గౌడ్ వివరాలను వెల్లడించారు. పశ్చిమగోదావరి జిల్లా కాశిపాడు గ్రామానికి చెందిన బొక్క చింతారావు నిజాంపేటలో ఉంటున్నాడు. గతంలో కారు డ్రైవర్‌గా పనిచేశాడు. సొంతూరిలో ఉంటూనే డబ్బు అవసరం వచ్చిన సమయంలో నగరానికి వచ్చి స్నాచింగ్‌లుచేసి ఊరెళ్లిపోయేవాడు. కేపీహెచ్‌బీలో నాలుగు, మియాపూర్‌లో ఒకటి, సనత్‌నగర్‌లో ఒకటి, దుండిగల్ పరిధిలో ఒక స్నాచింగ్ చేసి తప్పించుకు తిరుగుతున్నాడు. వరుస స్నాచింగ్‌లు జరగడంతో తనిఖీలు చేపట్టిన పోలీసులకు రైతుబజార్ వెనుక రోడ్డులో అనుమానాస్పదంగా సంచరిస్తుండగా అదుపులోకి తీసుకుని ప్రశ్నించారు. చైన్ స్నాచింగ్‌లు చేసినట్టు అంగీకరించాడు. చోరీ సొత్తును స్వాధీనం చేసుకుని నిందితుడిని రిమాండ్‌కు తరలించారు.
కేపీహెచ్‌బీలో చైన్‌స్నాచర్ అరెస్టు




