Thursday, 5 November 2026

కేరళలో పలుచోట్ల వర్షాలు బీభత్సం

కన్నూర్‌: కన్నూర్‌ జిల్లాలోని ఇరిట్టీ సమీపంలో భారీ వర్షాలకు ఏకంగా ఓ వంతెనతోసహ కారు ప్రవాహంలో కొట్టుకుపోయాయి. కారు డ్రైవర్‌, ఆ సమయంలో వంతెనపై నడుచుకుంటూ వెళ్తున్న ఆరుగుర్ని పోలీసులు స్థానికుల సాయంతో కాపాడారు. కరికొట్టకిరి సమీపంలో మరో వంతెన కూడా దెబ్బతిందన్నారు. వర్షాలకు చాలా ఇళ్లు దెబ్బతిన్నాయని, పంటలు నాశనమయ్యాయని అధికారులు తెలిపారు. కొండ చరియలు విరిగిపడి రవాణాకు తీవ్ర విఘాతం కలుగుతోందని వెల్లడించారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *