హైదరాబాద్, సెప్టెంబర్ 3: అసెంబ్లీలో వైఎస్ చిత్రపటం తొలగింపుపై రేగిన దుమారంపై మంత్రి యనమల స్పందించారు. అసెంబ్లీ లాబీలో ఆయన మాట్లాడుతూ స్పీకర్ అనుమతిలేకుండా అసెంబ్లీలో వైఎస్ ఫొటో పెట్టడం సరికాదని అభిప్రాయపడ్డారు. దీనిపై ఎలాంటి ఫిర్యాదు లేకుండానే చర్యలు తీసుకోవచ్చని ఆయన చెప్పారు. స్పీకర్‌కు కేవీపీ రాసిన లేఖను సభా హక్కుల ఉల్లంఘనగా పరిగణించాలని అన్నారు. వైసీపీ సభ్యులు అనవసర రాద్ధాంతం చేస్తున్నారని, స్పీకర్‌పై అనుచిత వ్యాఖ్యలు చేయడం మానుకోవాలని యనమల హితవు పలికారు
కేవీపీ రాసిన లేఖ సభా హక్కుల ఉల్లంఘనే: మంత్రి యనమల




