మురికివాడల్లో పర్యటన..
ముందుగా మహబూబ్‌నగర్, ఖమ్మం, కరీంనగర్
మహబూబ్‌నగర్,జనవరి14(జనంసాక్షి): మురికి వాడల్లోని దీన స్థితిని ప్రత్యక్షంగా పరిశీలించి వారి సమస్యలను పరిష్కరించాలన్న సంకల్పంతో ముందడుగు వేస్తున్న ముఖ్యమంత్రి కేసీఆర్ వరంగల్ మురికి వాడల్లో మొదటి అడుగు పెట్టగా ఈ నెల 18న పాలమూరులో రెండవ అడుగు వేయనున్నారు. వరంగల్‌లో ఏవిధంగా పర్యటించారో అవిధంగానే పాలమూరు మురికి వాడల్లో పర్యటిస్తారనీ ప్రజల్లో ఆశలు కలుగుతున్నాయి. ఇక్కడ ఎంతోకాలంగా సమస్యలు తిష్ట వేశాయి. వీటిని పరిష్కరించాలన్న డిమాండ్ మేరకు తదుపరి తన పర్యటనను సిఎం పాలమూరుకు కేటాయించారు. ఇక మహబూబ్‌నగర్ జిల్లాలో పెండింగ్‌లో ఉన్న ప్రాజెక్టులను త్వరితగతిన పూర్తిచేస్తామని రాష్ట్ర ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు నిరంజన్‌రెడ్డి స్పష్టం చేశారు. బుధవారం ఆయన జిల్లాలోని నాగర్‌కర్నూలు మండలం గుడిపల్లిలో పర్యటించారు. కేఎల్‌ఐ మూడో లిఫ్టు పనులను ఆయన పరిశీలించారు. ఇక్కడి పెండింగ్ ప్రాజెక్టులను పూర్తి చేసి ప్రజలకు ఇచ్చిన వాగ్దానాలు నెరవేరుస్తామని అన్నారు.





