Tuesday, 3 November 2026

కేసీఆర్‌ సాబ్‌ జరా సోచో..

C

– మేయర్‌ ముస్లింలకు ఇవ్వండి

– ఉర్దూ మాట్లాడగలగినవారు ఉంటే మేలు

– చెరి రెండున్నర సంవత్సరాలైనా మంచిదే

– గంగాజమున తాహజీబ్‌కు ప్రతీకైతది

– ముస్లిం సంఘాల డిమాండ్‌

హైదరాబాద్‌,ఫిబ్రవరి9(జనంసాక్షి):

తెలంగాణరాష్ట్రప్రభుత్వం ముస్లీం ప్రెండ్లీ ప్రభుత్వంగా పేరు తెచ్చుకొంది. గ్రేటర్‌హైదరాబాద్‌లో జరిగిన మున్సిపల్‌ ఘనవిజయం సాధించిన విషయం తెలిసిందే . పాతబస్తీలో గతంలో ఏరాజకీయ పార్టీకీ రానన్ని ఓట్లు టీఆరెెఎస్‌కు పోలయ్యాయి. పొలింగ్‌కుముందు కేసీఆరే విలేెకరుల సమావేశంలో ఎంఐఎం తమమిత్రపక్షమని ప్రకటించారు. గణనీయంగా ముస్లిం జనాభా ఉన్న హైదరాబాద్‌ నగరానికి ముస్లీం కార్పోరేటరే మేయరైతే మంచి సంకేతాలు వెళ్తాయని ముస్లీం పెద్దలు భావిస్తున్నారు. అలాగే హైదరాబాద్‌ మేయర్‌ చక్కటి ఉర్దు మాట్లడగలిగిన వారైతే మరి మంచిదని పలువురి అభిప్రాయం. ఎలాగు బీసీ జనరల్‌కు మేయర్‌ పీఠం రిజర్వుకావడం కేసీఆర్‌ ఎవరికి హామీ ఇవ్వక పోవడంతో ఈ దిశగా ఆలోచించాలని నగరవాసుల కోరిక.  అలా కాకపోయిన  చెరి రెండున్నర సంవత్సరాలు ఇచ్చిన మంచిదేనని మరోభిప్రాయం. గంగా,జమున,తహెజీబ్‌ హిందూముస్లీం సమూఖ్యతకు సమత్రగకు పేరెన్నికైన హైదరాబాద్‌ హిందూ, ముస్లీం అభ్యర్ధులను చెరి రెండున్నరేళ్లు మేయర్‌ చేస్తే కేసిఆర్‌ సమర్థతకు మంచి పేరు వస్తుందని విశ్లేషకులు భావిస్తున్నారు.

కాగా నగర మేయర్‌ ఎవరన్నది ఇంకా సస్పెన్స్‌ కొనసాగుతోంది. మేయర్‌ అభ్యర్థిపై ఇంకా టిఆర్‌ఎస్‌ నుంచి ఎలాంటి సంకేతాలు రాలేదు. ఎవరు తదుపరి ప్రతమ పౌరుడన్నది అధినేత కెసిఆర్‌ తేల్చాల్సి ఉంది. మరోవైపు ఈ నెల 11వ తేదీన చేపట్టనున్న ఈ కార్యక్రమానికి అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. గురువారం ఉదయం 11 గంటలకు పక్రియను ప్రారంభించనున్నారు. బుధవారం సాయంత్రానికి మేయర్‌,డిప్యూటి మేయర్‌ అభ్యర్థులపై స్పస్టత వచ్చే అవకాశం ఉంది. జీహెచ్‌ఎంసీలోని ప్రధాన కార్యాలయంలోనే ఎన్నిక నిర్వహించనున్నారు.  సమావేశం ప్రారంభం కాగానే ముందుగా కార్పొరేటర్ల చేత ప్రమాణ స్వీకారం చేయించనున్నారు. అనంతరం మేయర్‌ ఎన్నిక చేపట్టనున్నారు. మేయర్‌,డిప్యూటీ మేయర్లుగా ఎన్నిక కావాలంటే ప్రత్యక్ష ఎన్నికలో కార్పొరేటర్‌గా గెలుపొందాలి. ప్రభుత్వం బీసీ జనరల్‌ అభ్యర్థికి మేయర్‌ పదవిని రిజర్వ్‌ చేసింది. ఈ నేపథ్యంలో బీసీ సామాజిక వర్గానికి చెందిన మహిళ, పురుషుల్లో ఎవరోఒకరు మేయర్‌ పీఠాన్ని అధిష్ఠించేందుకు ఆస్కారం ఉంది. మేయర్‌ అభ్యర్థిత్వానికి ఒక్కరు మాత్రమే ముందుకు వచ్చినట్లయితే ఏకగ్రీవంగా నిర్ణయిస్తారు. ఇద్దరు ఉన్నట్లయితే కార్పొరేటర్లతో చేతులెత్తించి నిబంధనల మేరకు మెజారిటీ సాధించిన వ్యక్తిని మేయర్‌గా ఎంపిక చేయనున్నారు. ఒకవేళ ఇద్దరు రంగంలో ఉంటే అప్పుడు పోటీ ఉంటుంది. ఆ సమయంలో ముందుగా ఒక అభ్యర్థి పేరును పిలుస్తారు. అప్పుడు కార్పొరేటర్లు చేయి ఎత్తాల్సి ఉంటుంది. అధికారులు వాటిని లెక్కిస్తారు. తర్వాత రెండో అభ్యర్థి పేరును పిలిచిన తర్వాత మరోమారు చేయెత్తే వారిని లెక్కిస్తారు. హాజరైన సభ్యుల్లో సాధారణ మెజారిటీ వచ్చిన వ్యక్తిని మేయర్‌గా ప్రకటిస్తారు. డిప్యూటీ మేయర్‌ ఎన్నికను ఇదే తరహాలో నిర్వహిస్తారు. బల్దియాలో 150 మంది కార్పొరేటర్లతోపాటు 67 మంది ఎక్స్‌ అఫీషియో సభ్యులు ఉన్నట్లు లెక్కతేల్చారు. దీనికి అనుగుణంగా సీట్ల కేటాయింపు చేస్తున్నారు. వేదికపైన ప్రిసైడింగ్‌ అధికారి ఉంటారు. వేదిక కింద మొదటి వరుసలో ఎక్స్‌అఫీషియో సభ్యులు కూర్చునేందుకు అవకాశం ఇస్తారు. ఆ తర్వాత గెలుపొందిన అభ్యర్థులకు పార్టీల వారీగా, సభ్యులపేర్ల ఆధారంగా సీట్ల కేటాయింపు ఉంటుంది. హైదరాబాద్‌ కలెక్టర్‌ రాహుల్‌బొజ్జా ప్రిసైడింగ్‌ అధికారిగా వ్యవహరించనున్నారు. ఇకప్రమాణాన్ని ఒకేసారి నిర్వహించేలా చర్యలు తసీఉకుంటున్నారు. దీంతో తెలుగు వచ్చిన కార్పొరేటర్లందరితో ఒకసారి ప్రమాణస్వీకారం, ఆంగ్లం వచ్చిన వారితో ఒకసారి, ఉర్దూ, హిందీ వచ్చిన వాళ్లతో ఒక్కొక్కసారి చేయించనున్నారు. దీనివల్ల నాలుగు దఫాల్లోనే ప్రమాణ స్వీకార కార్యక్రమాన్ని పూర్తి చేయనున్నారు. దీంతో సమయం ఆదా కానుంది. గుర్తింపు పొందిన పార్టీ నుంచి మేయర్‌గా పోటీ చేసే వ్యక్తి ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడి నుంచి ఫారం-ఏ, ఫారం-బి ధ్రువీకరణ పత్రాలను తేవాలి. అప్పుడు ఆ వ్యక్తి పార్టీ తరఫున మేయర్‌ అభ్యర్థిగా పోటీ చేసేందుకు అర్హత సాధిస్తారు. బల్దియాలో ఐదుగురిని కో-ఆప్షన్‌ సభ్యులుగా ఎంపిక చేసేందుకు ఆస్కారం ఉంది. ఇందులో ఇద్దరిని కచ్చితంగా మైనారిటీలను ఎంపిక చేయాలి. మరో ముగ్గురు సాధారణ సభ్యులను మున్సిపల్‌ పరిపాలనలో అనుభవం ఉన్నవారిని ఎంపిక చేయాలి. వీరిలో ఒకరిని కచ్చితంగా మహిళను ఎంపిక చేయాలి. అంటే కో-ఆప్షన్‌ సభ్యుల్లో ఇద్దరు కచ్చితంగా మహిళలు ఉండాలి. వీరి ఎంపికకు అధికారులు నోటిఫికేషన్‌ జారీ చేస్తారు. దరఖాస్తు చేసుకున్న వారి నుంచి కార్పొరేటర్లు ఐదుగురిని ఎంపిక చేస్తారు. ఇవి పూర్తిగా రాజకీయంగా ఉంటాయి. కో-ఆప్షన్‌ సభ్యుల ఎంపికకు మరో నెల గడువు ఉంది.కార్పొరేటర్ల సంఖ్యకు అనుగుణంగా స్థాయి సంఘ సభ్యులను ఎన్నుకునే అవకాశం ఉంది. ప్రతి పదిమంది కార్పొరేటర్లకు ఒక స్థాయి సంఘ సభ్యుడిని ఎన్నిక చేయవచ్చు.అంటే బల్దియాలో 15 మంది స్థాయి సంఘ సభ్యులు ఉండేందుకు ఆస్కారం ఉంది. మొత్తంగా టిఆర్‌ఎస్‌ భారీ మెజార్టీతో గెలిచి 99 సీట్లు సాధించినందున టిఆర్‌ఎస్‌ నుంచి మేయర్‌ ఎవరన్నది తేలనుంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *