Tuesday, 3 November 2026

కొండచరియలు విరిగిపడి దంపతులు మృతి

తుని గ్రామీణం: తూర్పు గోదావరిజిల్లా తుని మండలం జగన్నాధగిరి సమీపంలో ఉన్న ముగ్గు కొండచరియలు విరిగిపడి దంపతులు మృతిచెందారు. విశాఖ జిల్లా కేసవరం గ్రామానికి చెందిన నూకరాజు, ఎల్లాయమ్మ దంపతులపై కొండచరియలు విరిగిపడటంతో ప్రమాదం జరిగింది. రాళ్ల మధ్య చిక్కుకున్న ఇద్దరి మృతదేహాలను స్థానిక పోలీసులు, అగ్నిమాపక సిబ్బంది వెలికితీసి పోస్టు మార్టం నిమిత్తం తుని ఏరియా ఆసుపత్రికి తరలించారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *