కొత్త కమిషనర్‌గా గాంధీ బాధ్యతల స్వీకరణ

రాజమహేంద్రవరం,మే17(జ‌నం సాక్షి ):  రాజమహేంద్రవరం నగరపాలకసంస్థ నూతన కమిషనర్‌గా సుమిత్‌కుమార్‌ గాంధీ గురువారం బాధ్యతలు స్వీకరించారు. ఇప్పటి వరకూ కమిషనర్‌గా పనిచేసిన విజయరామరాజును తిరుపతికి బదిలీ చేయడంతో నర్సాపురం సబ్‌కలెక్టర్‌గా పనిచేస్తున్న గాంధీని రాజమహేంద్రవరం బదిలీ చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. బాధ్యతల స్వీకరణ అనంతరం గాంధీ విలేకర్లతో మాట్లాడుతూ అభివృద్ధి పనులు కొనసాగిస్తామని పేర్కొన్నారు. ప్రధానంగా నగరంలో పారిశుద్ధ్యం, నగర సుందరీకరణ, రోడ్ల విస్తరణకు ప్రాధాన్యత ఇస్తామని ఆయన తెలిపారు.

తాజావార్తలు