17 కొత్త జిల్లాలతో కలిపి మొత్తం 27 జిల్లాల డ్రాఫ్ట్ ఇవాళ విడుదల కానుంది. రెవెన్యూ డివిజన్లు, మండలాల సంఖ్య పెరిగే అవకాశముంది. వివరాలన్నీ ఈనెల 23 నుంచి అన్ని జిల్లాల్లో అందుబాటులోకి వస్తాయి. రాష్ట్ర సచివాలయం నుంచి గ్రామ సచివాలయం వరకు అన్ని ప్రభుత్వ కార్యాలయాలూ, స్థానిక సంస్థల్లో ప్రకటనను నోటీస్ బోర్డులపై ప్రదర్శిస్తారు. నెల రోజుల లోపు ప్రజలు తమ వినతులను, అభ్యంతరాలను జిల్లా కలెక్టర్ కార్యాలయాలు, హైదరాబాద్ నాంపల్లిలోని భూపరిపాలన కార్యాలయంలో లిఖితపూర్వకంగా అందజేయాల్సి ఉంటుంది.
కొత్త జిల్లాలు ఇవే..




