కొత్త నోట్లు వస్తే ఒత్తిడి తగ్గుతుంది
కొత్త నోట్లు వస్తే చాలావరకు ఒత్తిడి తగ్గుతుందని ముఖ్యమంత్రి చంద్రబాబు అన్నారు. సోమవారం నగదు రహిత లావాదేవీల పురోగతిపై చంద్రబాబు టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. రూ. 50, రూ. 20 కొత్త నోట్లు రాబోతున్నాయని, కొత్తనోట్లు వస్తే ఒత్తిడి తగ్గుతదని అన్నారు. రైతులు, చేతివృత్తులవారు, పెన్షనర్ల ఇబ్బందులు తొలగించాలని ఆయన అధికారులు ఆదేశించారు.