Monday, 2 November 2026

కొత్త రూ.500 నోట్లు వచ్చేశాయి

 new-currency-note-of-rs-500_9301cca4-a9c2-11e6-9005-31625660f15fకొత్త రూ.500 నోట్లు వచ్చేశాయి. హైదరాబాద్‌లోని ఏటీఎంల నుంచి ఈనోట్లను తీసుకుంటున్నారు జనం. రిజర్వ్‌ బ్యాంకు ఎదురుగా ఉన్న ఆంధ్రా బ్యాంకు ఏటీఎంలో వీటిని ఉంచారు. ఈ విషయం తెలిసిన జనం అర్థరాత్రే ఏటీఎం ఎదుట బారులు తీరారు. రెండు రాష్ట్రాలకు కలిపి రూ.400 కోట్ల విలువైన కొత్త రూ.500 నోట్లను రిజర్వ్ బ్యాంకు పంపించింది. పెద్దనోట్ల రద్దు అనంతరం కొత్త రూ.2000 నోట్లను కేంద్రం అందుబాటులోకి తీసుకువచ్చింది. కాగా రూ.2000 నోటుకు చిల్లర లేకపోవడంతో ప్రజలు నానా ఇబ్బందులు ఎదుర్కున్నారు. తాజాగా హైదరాబాద్ ఏటీఎంలలో కొత్త రూ.500నోట్లు రావడంతో ఇకపై చిల్లర కష్టాలు తీరనున్నాయి.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *