కోచ్ పదవి పొడగింపునకు నిరాకరించిన క్రిస్టెన్
్వతిళిప్డ్డ్డొల్యీరనర&కూ-ాఱ : దక్షిణాఫ్రికా క్రికెట్ జట్టు కోకగా వ్యవహరిస్తోన్న గ్యారీ కిరిస్టెన్ తన పదవీకాలం ముగింపు కోసం ఎదురుచూస్తున్నాడు. ఒప్పందాన్ని పొడిగించుకోవాలని సౌతాఫ్రికా క్రికెట్ బ్డోం కోరినప్పటకీ… కిరిస్టెన్ మాత్రం నిరాకరించాడు. కుటుంబ కారణాలతోనే ఈ నిర్ణయానికి వచ్చినట్టు తెలుస్తోంది. గతంలో భార’కు కోచింస్త్ర బాధ్యతలు తీసుకున్నప్పుడు కూడా కుటుంబ కారణాలతోనే తప్పుకున్నాడు. టీమిండియాను విశ్వవిజేతగా నిలపడంతో పాటు టెస్టుల్లో అగ్రస్థానానికి చేర్చిన కిరిస్టెన్‌తో ఒప్పందాన్ని పునరుధ్దరించుకునేందుకు బీసిసిఐ ప్రయత్నించినా అతను తిరస్కరించాడు. ఆ తర్వాత తన సొంతదేశం సౌతాఫ్రికాకు 2011 ఆగష్టులో కోకగా బాధ్యతలు చేపట్టాడు. రెండేళ్ళ పాటు కుదుర్చుకున్న ఈ ఒప్పందం వచ్చే జూలైతో ముగియనుంది. అయితే తన పదవీకాలం పొడిగించుకోకూడదని కిరిస్టెన్ నిర్ణయించుకున్నాడు. గత నాలుగేళ్ళుగా ఈ బాధ్యతలతో కుటుంబానికి దూరంగా ఉండడమే దీనికి కారణంగా కనిపిస్తోంది. ఇకపై ఎక్కువ సమయం తన కుటుంబంతో గడపాలని అతను భావిస్తున్నట్టు , అందుకే కాంట్రాచ్టీ తిరస్కరించినట్టు సౌతాఫ్రికా క్రికెట్ బ్డోం తెలిపింది. దక్షిణాఫ్రికాకు కోకగా వ్యవహరించిన రెండేళ్ళలో ఆ జట్టు స్వదేశంలోనూ , విదేశాల్లోనూ మంచి విజయాలు సాధించింది. అలాగే టెస్టుల్లో నెంబం వన్ ర్యాంచీ కూడా కైవసం చేసుకుంది. కిరిస్టెన్ దూరమవడం జట్టుకు ఇబ్బందేనని , అయితే అతని వ్యక్తిగత విషయాలను కూడా పరిగణలోకి తీసుకోవాలని సఫారీ బ్డోం అభిప్రాయపడింది. అటు తన జాతీయ జట్టుకు ఆటగాడిగానూ , కోకగానూ సేవలందించడంపై గౌరవంగా ఉందని కిరిస్టెన్ వ్యాఖ్యానించాడు. జట్టులోని ఆటగాళ్ళకు , దక్షిణాఫ్రికా బోర్డుకు కృతజ్ఞతలు తెలియజేశాడు.