Tuesday, 3 November 2026

కోటి ఎకరాలకు సాగునీరు అందిస్తాం

C

– ఖమ్మం జిల్లాను సస్యశ్యామలం చేస్తాం

– ప్రాజెక్టులకు శంకుస్థాపన చేసిన సీఎం కేసీఆర్‌

ఖమ్మం,ఫిబ్రవరి 16(జనంసాక్షి):  తెలంగాణలో కోటి ఎకరాల భూమిని సస్యశ్యామలం చేస్తామని రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్‌ ప్రకటించారు. గతంలో ఏ పని చేపట్టాలన్నా అడ్డంకు వచ్చేవని, ఇప్పుడా పరిస్థితి లేదన్నారు. తెలచ్చుకున్న తెలంగాణలో ఇక ఎలాంటి అడ్డంకులు లేకుండా సస్య శ్యామలం చేసేందుకు కంకణం కట్టుకున్నామని అన్నారు. రెండోరోజు ఖమ్మం జిల్లా పర్యటనలో భాగంగా సీఎం కేసీఆర్‌ మంగలవారం తిరుమలాయపాలెంలో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో ప్రసంగించారు.  తిరుమలాయ పాలెంలో భక్తరామదాసు ఎత్తిపోతల పథకానికి సీఎం శంకుస్థాపన చేశారు. అనంతరం అక్కడ ఏర్పాటు చేసిన బహిరంగ సభలో సీఎం మాట్లాడుతూ.. భక్తరామదాసు ఎత్తిపోతల పథకాన్ని ఆరు నెలల్లో పూర్తి చేస్తాం. వచ్చే ఖరీఫ్‌ నాటికి పంట పొలాలకు నీరందిస్తాం. ఇక నుంచి రెండు పంటలకు నీళ్లిస్తాం. మిషన్‌ భగీరథ ద్వారా తిరుమలాయపాలెంకు నీరందిస్తామని అన్నారు. రామదాసు గొప్ప భక్తుడని ఆయన ఆశిస్సుఉల మనకు ఉంటాయన్నారు. 2016 డిసెంబరులోపు మిషన్‌ భగీరథలో భాగంగా పాలేరు రిజర్వాయర్‌ ద్వారా నియోజకవర్గ ప్రజలకు తాగునీరు అందిస్తామని తెలిపారు. రాబోయే నాలుగేళ్లలో సాగు, తాగునీటి రంగానికి రూ.లక్షా 25వేల కోట్లు ఖర్చు చేయనున్నట్లు చెప్పారు. రాబోయే రెండేళ్లలో రెప్పపాటు కూడా కరెంటు పోకుండా త్రీఫేజ్‌ విద్యుత్‌ ఇస్తామని వెల్లడించారు. ముస్లింలు, గిరిజనులు, దళితులు అభవృద్ధి చెందినప్పుడే సంపూర్ణ తెలంగాణకు సార్థకత చేకూరుతుందన్నారు. పాలేరు నియోజకవర్గంలోని ప్రజలకు డబుల్‌ బెడ్‌ రూం ఇళ్లు మంజూరు చేస్తామని ప్రకటించారు. మార్చి 31 నుంచి బీసీలకు కల్యాణ లక్ష్మి పథకం వర్తింపజేస్తామన్నారు. రాష్ట్రంలో దళితులు, గిరిజనులు, మైనార్టీ ప్రజలు బాగుపడాలి. అన్ని వర్గాలు సంపూర్ణంగా బాగుపడిన రోజే అసలైన తెలంగాణ వచ్చినట్లు అని పేర్కొన్నారు. అర్హులైన పేదలందరికి డబుల్‌ బెడ్‌రూం ఇండ్లు నిర్మించి ఇస్తాం. రూ. 14 వేల కోట్లతో రెండు లక్షల ఇండ్లు నిర్మించబోతున్నాం. ఇక మార్చి 31 నుంచి రేషన్‌ కార్డున్న దళిత, బీసీ, మైనార్టీ యువతులందరికి కళ్యాణలక్ష్మీ వర్తింపజేస్తామని ప్రకటించారు. పీడీఎస్‌యూ సంఘం విద్యార్థులు చీప్‌ పాలిటిక్స్‌ చేస్తున్నారు. చీప్‌ పాలిటిక్స్‌ చేస్తే సహించం. రాబోయే రోజుల్లో కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ఇలాంటి చిల్లర రాజకీయాలు చేసే వారిపట్ల కఠినంగా వ్యవహరించి ఉక్కుపాదంతో అణచివేస్తామని అన్నారు. కార్యక్రమంలో రాష్ట్ర మంత్రులు హరీశ్‌రావు, తుమ్మల నాగేశ్వరరావు, ఎంపీ కె.కేశవరావు, ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర్‌రెడ్డి, పలువురు ఎమ్మెల్యేలు పాల్గొన్నారు.

హరీశ్‌రావును అభినందించిన కేసీఆర్‌

/ూరాయణఖేడ్‌ నియోజకవర్గంలో తెరాస ఘనవిజయం సాధించడం పట్ల సీఎం కేసీఆర్‌ హర్షం వ్యక్తం చేశారు. గెలుపు బాధ్యతను భుజాన వేసుకుని పనిచేసిన రాష్ట్రమంత్రి హరీశ్‌రావును సీఎం అభినందించారు.

మెదక్‌ జిల్లాలోని నారాయణఖేడ్‌ నియోజకవర్గం ఉప ఎన్నికలో టీఆర్‌ఎస్‌ విజయం సాధించిందని సీఎం కేసీఆర్‌ తెలిపారు. భక్తరామదాసు ప్రాజెక్టు శంకుస్థాపన సభలో సీఎం మాట్లాడుతూ.. ఖేడ్‌ ప్రజలు అపురూపమైన మెజార్టీ ఇచ్చి టీఆర్‌ఎస్‌ను గెలిపించారు. అఖండ విజయాన్ని అందించిన నారాయణఖేడ్‌ ప్రజలకు హృదయపూర్వక ధన్యవాదాలు తెలిపారు. అహర్నిశలు శ్రమించి టీఆర్‌ఎస్‌ విజయానికి కారణమైన

మంత్రి హరీష్‌రావుకు అభినందనలు. విజయానికి కారణమైన నేతలు, కార్యకర్తలకు ధన్యవాదాలు తెలిపారు.

తరవాత టేకులపల్లి మండలం రోళ్లపాడులో సీతారామ ఎత్తిపోతల పథకానికి ముఖ్యమంత్రి కేసీఆర్‌ శంకుస్థాపన చేశారు. సీతారామ ఎత్తిపోతల పథకం శంకుస్థాపన కార్యక్రమంలో నీటి పారుదల శాఖ మంత్రి హరీష్‌రావు, మంత్రి తుమ్మల నాగేశ్వర్‌రావు, ఎంపీ కె. కేశవరావుతో పాటు పలువురు నేతలు పాల్గొన్నారు. తొలుత సిఎం ముదిగొండ మండలం ముత్తారంలోని శ్రీసీతారామచంద్రస్వామి దేవాలయాన్ని  దర్శించుకున్నారు. ఆలయ అర్చకులు పూర్ణకుంభంతో ముఖ్యమంత్రికి ఘనస్వాగతం పలికారు. ఆలయంలో అష్టోత్తరం, ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆలయానికి ప్రాకార మండపం, స్వామివారి కల్యాణ మండపం, కాలక్షేప మండపం, అర్చక సదనం నిర్మాణానికి నిధులు మంజూరు చేయాలని అర్చకులు, ప్రజాప్రతినిధులు ముఖ్యమంత్రిని కోరారు. అంచనాలు రూపొందించి నివేదిక అందిస్తే నిధులు మంజూరు చేస్తామని కేసీఆర్‌ హావిూ ఇచ్చారు. సర్పంచి వెలుగొండస్వామి ముఖ్యమంత్రికి సీతారాముల పంచలోహ విగ్రహాన్ని అందజేశారు. ఈ కార్యక్రమంలో మంత్రులు తుమ్మల నాగేశ్వరరావు, హరీశ్‌రావు, ఎమ్మెల్సీలు బాలసాని లక్ష్మీ నారాయణ, పల్లా రాజేశ్వరరెడ్డి, కొత్తగూడెం ఎమ్మెల్యే జలగం వెంకటరావు, జిల్లా పరిషత్‌ ఛైర్‌పర్సన్‌ కవిత తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *