Monday, 2 November 2026

కోడి కొండెక్కేసింది

77హైదరాబాద్ : కోడి కొండెక్కేసింది. వంద నోట్లు మూడు చూపిస్తే గాని ముక్కకూడా రాల్చనంటోంది. ఐదు సెంచరీలు దాటేసిన మేకను వదిలేసిన మాంసప్రియులు కోడితో సరిపెట్టేసుకుంటున్నారు. ఇప్పుడా కోడి కూడా డబుల్ సెంచరీ దాటడంతో అరకోడితో సర్దుకుంటున్నారు.

రూ.250 చేరువలోకిలోచికెన్‌పది రోజుల క్రితం వరకు సామాన్యులకు కాస్తోకూస్తో అందుబాటులో ఉన్న చికెన్ ధరలు ఇప్పుడు అమాంతం పెరిగిపోయాయి. పండుగ వేళ్ల ముక్క నోట్లోకి వెళ్లాలంటే వంద నోట్లు మూడు ఉంటేనేగాని వెళ్లడం లేదు. కిలో చికెన్‌ 250 రూపాయలకు చేరువలో ఉండటంతో సామాన్యులు నోరెళ్లబెట్టి కోడివంక ధీనంగా చూస్తున్నారు.

45-60 చేరినడజన్‌కోడిగుడ్లధర

తాజాగా పెరిగిన ధరలు కోడినే కాదు కోడిగుడ్డును కూడా సామాన్యులకు దూరం చేస్తున్నాయి. కోడిగుడ్డు రేటు కూడా భారీగా పెరిగింది. సరిగ్గా పదిరోజుల క్రితం డజన్‌ 45 రూపాయలున్న కోడిగుడ్లు ఇప్పుడు ఒకేసారి 60రూపాయలు దాటిపోయాయి.చికెన్‌, కోడిగుడ్డు ధరలు పెరగడంతో కస్టమర్లు లేక షాపులు బోసిపోతున్నాయి. వరుసగా వస్తున్న వేడుకల నేపథ్యంలో పెరిగిన చికెన్‌ ధరలు సామాన్యులను ఆందోళనకు గురి చేస్తున్నాయి. రెగ్యులర్‌ కస్టమర్లు కూడా దుకాణాలకు రావడంలేదని చికెన్‌ వ్యాపారులు అంటున్నారు.

కోడితో పాటు కూరగాయలు కూడా…

ఓ వైపు కోడి..మరో వైపు కూరగాయల ధరలు మండిపోతుండటంతో సామాన్యులు కిలో దగ్గర అరకిలోనే కొనుక్కొని సర్దుకుంటున్నారు. మార్కెట్‌లో చోటుచేసుకుంటున్న పరిణామాలు సామాన్యులకు ముద్ద దిగనివ్వడం లేదు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *