Monday, 2 November 2026

కోలుకుంటున్న చెన్నై

C

– కొనసాగుతున్న సహాయక చర్యలు

– ఏటీఎం, పెట్రోల్‌ పంపుల వద్ద భారీ క్యూలు

చెన్నై,డిసెంబర్‌,05(జనంసాక్షి): దాదాపు వారం రోజులకు పైగా విపరీతమైన వర్షాలు, వరదలతో అల్లాడుతున్న చెన్నైలో ఇప్పుడిప్పుడే సాధారణ పరిస్థితులు నెలకొంటున్నాయి. నగరం పాక్షికంగా సాధారణ స్థితికి చేరువ అవుతోంది. అయితే మళ్లీ వర్షాలు సహాయక చర్యలకు ఆటంకంగా మారింది. చెన్నైని భారీ వర్షం మళ్లీ ముంచెత్తుతుంది. కోయంబేడు, పళ్లవాక్కం, ఎగ్మోర్‌, అన్నామలై, జఫర్‌ఖాన్‌పేట్‌, సైదాపేట్‌, తొట్టూరుపురం, మండవల్లి, అడయార్‌, పాలిచలూర్‌, ఆడంబాకం ప్రాంతాల్లో వర్షం కురుస్తుంది. లోతట్టు ప్రాంతాల ప్రజలు ఆందోళనతో బిక్కుబిక్కుమంటున్నారు. సహాయ పునరావాస కార్యక్రమాలకు ఆటంకం ఏర్పడుతుంది. కాగా చెన్నైలో వరద ప్రాంతాల పరిస్థితిపై కేబినెట్‌ సెక్రటరీ తాజాగా సవిూక్ష చేపట్టారు. ఎన్డీఆర్‌ఎఫ్‌, రైల్వే, సమాచార, విద్యుత్‌శాఖ ఉన్నతాధికారులతో ఆయన ఈ సవిూక్ష జరిపి సహాయ కార్యక్రమాలపై అడిగి తెలుసుకున్నారు.  చెన్నైలో మళ్లీ భారీ వర్షం కురుస్తోంది. శనివారం ఉదయం కోయంబేడ్‌ , పళ్లవాక్కం, ఎగ్మోర్‌, అన్నామలై కాలనీ, జఫర్‌ఖాన్‌పేట్‌, సైదాపేట్‌, తొట్టూరుపురం, మండవల్లి, అడయార్‌, పొలిచలూర్‌, ఆడంబాకం తదితర ప్రాంతాల్లో భారీ వర్షం కురుస్తోంది. దీంతో లోతట్టుప్రాంతాల ప్రజలు తీవ్ర ఆందోళనకు గువ్నతున్నారు. చెన్నైలో సహాయ పునరావాస కార్యక్రమాలకు తీవ్ర ఆటకం కలుగుతోంది. అయినా ఎన్డీఆర్‌ఎఫ్‌, ఆర్మీ తమ సహాయక చర్యలను ముమ్మరం చేస్తున్నారు. రోడ్ల విూద నీళ్లు తగ్గుతుండటంతో.. ఏటీఎంలు, పెట్రోలు బంకుల వద్ద పొడవాటి క్యూలైన్లు కనిపిస్తున్నాయి. అక్టోబర్‌ ఒకటో తేదీ నుంచి వరుసపెట్టి కురుస్తున్న వర్షాల కారణంగా ఇప్పటివరకు సుమారు 245 మంది మరణించినట్లు తమిళనాడు ప్రభుత్వం ప్రకటించింది. మంగళవారం నుంచి వరద ఉధృతి ఒక్కసారిగా పెరిగింది. ప్రధానంగా రోడ్లు కొట్టుకుపోవడం, రైలు మార్గాలు పాడవ్వడం, విమానాశ్రయంలోకి కూడా నీళ్లు చేరుకోవడంతో ఆకాశ మార్గం కూడా మూసుకుపోయింది. కొట్టుపురం, ముడిచూర్‌, పల్లిక్కరనై లాంటి చాలా ప్రాంతాల్లో ఇప్పటికీ నీళ్లు నిలిచే ఉన్నాయి. నిత్యావసర వస్తువుల కొరత పట్టి పీడిస్తోంది. అతి కొద్దిసంఖ్యలో మాత్రమే ఏటీఎంలు, పెట్రోలు బంకులు తెరవడంతో.. వాటివద్ద పొడవాటి క్యూలైన్లు కనపడుతున్నాయి. రెండు రోజుల్లో చాలావరకు పెట్రోలు బంకులు తెరుస్తారని, ప్రజలు ఆందోళన  చెందవద్దని తమిళనాడు ప్రభుత్వం ప్రకటించింది. ఆదివారం అయినా బ్యాంకులు పనిచేస్తాయని చెప్పారు. ఎప్పుడూ బిజీగా ఉండే ఎగ్మూర్‌ – తాంబరం స్టేషన్ల మధ్య రైళ్లు నడిపిస్తామని దక్షిణ రైల్వే ప్రకటించింది. దాంతో స్థానికులకు చాలావరకు ఇబ్బందులు తొలగిపోతాయని భావిస్తున్నారు. తాంబరం సహా చాలా ప్రాంతాల్లో టెలిఫోన్‌ ల్యాండ్‌లైన్లను పునరుద్ధరిస్తున్నారు. మొబైల్‌ సేవలు కూడా క్రమంగా పుంజుకుంటున్నాయి. శుక్రవారం రాత్రి, శనివారం ఉదయం కూడా కొన్ని ప్రాంతాల్లో ఓ మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిశాయి. దాంతో సహాయ పనులకు ఆటంకం కలిగింది. కూరగాయలు, పాలు మాత్రం ఇంకా కొరతగానే ఉండటంతో వాటి ధర ఆకాశాన్ని అంటుతోంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *