అభివృద్ది నిధులపై ఆరా
విజయనగరం,నవంబర్13(జనంసాక్షి): ఫోర్త్ స్టేట్ ఫైనాన్స్ కమిషన్ చైర్మన్ జి.నాంచారయ్య ఆధ్వర్యంలో పార్వతీపురంలోని మున్సిపల్ కార్యాలయంలో కౌన్సిలర్ సభ్యులందరితో మంగళవారం సమావేశమయ్యారు. ఈ సందర్భంగా అక్టోబర్ వరకూ పరిశీలించిన అన్ని మున్సిపల్ కార్యాలయాల్లో, మండలాల్లో, గ్రామాల్లో చేపట్టవలిసిన అభివృద్ది కార్యక్రమాలపై చర్చించారు. సమావేశానికి హాజరైన కౌన్సిలర్ సభ్యులంతా తాము ఇంత వరకూ తమ పరిధిలో ఉన్న ప్రాంతాల్లో చేపట్టిన కార్యక్రమాల గురించి చైర్మన్‌కు వివరించారు. చేపట్టాల్సిన అభివృద్ధి కార్యక్రమాలకు సంబంధించి ఎంత బడ్జెట్ అవసరమవు తుందనే వివరాలు ఇచ్చారు. అన్ని మండల్లాల్లోనూ సమావేశాల అనంతరం పూర్తి నివేదికను ప్రభుత్వానికి అందిస్తామని చైర్మన్ తెలిపారు. సమావేశం అనంతరం చైర్మన్ చేతుల విూదుగా పారిశుధ్య కార్మికులకు మాస్క్‌లు, బూట్లు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో చైర్మన్ జి.నాంచారయ్యతో పాటు నలుగురు సభ్యులు హాజరయ్యారు. బి.నాగరాజు, టి.భాస్కరరావు, ఐ.సత్యన్న, తదితరులు పాల్గొన్నారు.




