హైదరాబాద్ లో భవనాల క్రమబద్దీకరణ నోటిఫికేషన్ విడుదల చేసిన జీహెచ్ఎంసీ.. ఆన్ లైన్ ద్వారా దరఖాస్తులు స్వీకరించాలని డిసైడ్ అయింది. అందులో భాగంగా ఇవాళ్టి నుంచి ఆన్ లైన్ లో దరఖాస్తులు స్వీకరించనుంది. బీఆర్ఎస్, ఎల్ఆర్ఎస్ ప్రక్రియలో భాగంగా అక్రమ కట్టడాలపై కఠిన చర్యలు తీసుకుంటామని బల్దియా కమిషనర్ హెచ్చరించారు. రానున్న రోజుల్లో అక్రమ కట్టడాలు గుర్తించడానికి గూగుల్ మ్యాప్ తో పాటు, అత్యాధునిక టెక్నాలజీ ఉపయోగిస్తామని కమిషనర్ జనార్ధన్ రెడ్డి చెప్పారు.
వంద గజాల కంటే తక్కువ స్ధలం ఉన్న వారికి క్రమబద్దీకరణ ఫీజు ఒక్కో గజానికి పదిహేను రూపాయలు వసూలు చేయనుంది. ప్రభుత్వం గుర్తించిన బస్తీల్లో మాత్రం గజానికి ఐదు రుపాయలు మాత్రమే ఫీజు వసూలు చేయనున్నారు. ఇక క్రమబద్దీకరించని అక్రమ లేఅవుట్స్, అపార్ట్ మెంట్స్, కమర్షియల్ కాంప్లెక్స్‌లకు వాటి ప్లింత్ ఏరియాను బట్టీ ఫీజులు వసూలు చేస్తున్నట్టు టౌన్ ప్లానింగ్ అధికారులు తెలిపారు. ఫైర్ సేఫ్టీ సర్టిఫికెట్ లేకపోతే ధరఖాస్తులు స్వీకరించమని జిహెచ్ఎంసి స్పష్టం చేసింది.
అయితే అపార్ట్ మెంట్స్ ఉన్నవారికి కొంత వెసులుబాటు కల్పిస్తోంది జీహెచ్ఎంసీ.. బిల్డర్ లేక పోతే ఆ ప్లాట్ ఓనర్స్ వారి ఇంటి వివరాలతో బీఆర్ఎస్ కు అప్లై చేసుకోవాలని సూచించారు. మరోవైపు ఫైర్ డిపార్ట్ నుంచి సర్టిఫికెట్ లేని భవనాలకు నో అబ్జక్షన్ సర్టిఫికెట్ ఉంటేనే రెగ్యులరైజ్ చేస్తామని స్పష్టం చేసారు.





