క్రికెట్‌ బెట్టింగ్‌కు పాల్పడ్డ పది మంది అరెస్ట్‌

కాకినాడ,మే11(జ‌నం సాక్షి ): క్రికెట్‌ బెట్టింగ్‌కు పాల్పడిన 10 మందిని అరెస్ట్‌ చేసినట్లు రామచంద్రాపురం డీఎస్పీ సంతోష్‌ వెల్లడించారు. మండపేట పట్టణ పోలీసు స్టేషన్‌లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ సత్యశ్రీ రోడ్డులోని ఒక ఇంటిలో క్రికెట్‌ చూస్తూ బెట్టింగ్‌ ఆడుతున్న పదిమందిని అరెస్ట్‌ చేసి వీరి నుంచి రూ.52,130 నగదు, 9 సెల్‌ఫోన్లు ఓ టీవీ, ల్యాప్‌ట్యాప్‌ స్వాధీనం చేసుకున్నామని వెల్లడించారు. మరో 15 మంది క్రికెట్‌ బెట్టింగ్‌ ఆడుతున్నట్లుగా గుర్తించామని వారిని గుర్తించే పనిలో ఉన్నామని డీఎస్పీ చెప్పారు. టాస్క్‌ఫోర్సు డీఎస్పీ పల్లంరాజు మాట్లాడుతూ తూ.గో జిల్లా ఎస్పీ విశాల్‌గున్ని ప్రత్యేక టాస్క్‌ఫోర్సును ఏర్పాటు చేశారని జిల్లాలో కోడిపందేలు, అసాంఘిక కార్యకలాపాలు నిర్వహిస్తే ఎంతటి వారైనా చర్యలు తీసుకుంటామని తెలిపారు.

తాజావార్తలు