నగరంలో పారిశుధ్య కార్యక్రమాల పర్యవేక్షణ, నగర నిర్వహణలో నిత్యం బిజీగా ఉండే బల్దియా కమిషనర్ డా.బి.జనార్దన్‌రెడ్డి నేడు క్రికెట్‌ను ఆడారు. ఈస్ట్‌జోన్‌లోని ఎల్బీనగర్ సర్కిల్లో పర్యటించిన జనార్దన్‌రెడ్డి హరితహారంలో భాగంగా విక్టోరియా మెమోరియల్ మైదానంలో నాటిన మొక్కల సంరక్షణకు చేపట్టిన చర్యలను తనిఖీచేశారు. ఈ సందర్భంగా ఇదేగ్రౌండ్లో జరుగుతున్న క్రికెట్ టోర్నమెంట్‌కు నిర్వాహకులు కమిషనర్‌ను ఆహ్వానించారు. దీంతో స్వతహా బ్యాడ్మింటన్ క్రీడాకారుడైన డాక్టర్ జనార్దన్‌రెడ్డి క్రికెట్‌ను ఆడారు. దాదాపు అరగంటకు పైగా పాల్గొన్న ఈ క్రికెట్లో బ్యాటింగ్చేసి అనుభవజ్ఞుడైన క్రీడాకారుడి మాదిరిగా పలు షాట్లను సులువుగా కొట్టడంతో చప్పట్ల ద్వారా హర్షధ్వానాలు వ్యక్తం చేశారు.
క్రికెట్ ఆడిన బల్దియా కమిషనర్





