Tuesday, 3 November 2026

క్రిమినల్స్ లేని స్వచ్ఛ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం పనిచేస్తోందని నిజామాబాద్ ఎంపీ కవిత…

kavitthaక్రిమినల్స్ లేని స్వచ్ఛ తెలంగాణ పనిచేకోసం రాష్ట్ర ప్రభుత్వం పనిచేస్తోందని
నిజామాబాద్ ఎంపీ కవిత చెప్పారు. నయీం ఎన్ కౌంటర్ పై అడిగిన ప్రశ్నలకు ఆమె స్పందించారు. చట్ట పరిధిలో జరగాల్సింది జరిగిందన్నారు. అరాచక శక్తుల ఆట కట్టించే సమయం ఆసన్నమైందని స్పష్టం చేశారు. నయీం ఎన్ కౌంటర్ ను రాజకీయం చేయొద్దని ప్రతిపక్షాలకు కవిత సూచించారు. మాజీ మంత్రులు ఎవరికైనా నయీంతో సంబంధాలుంటే విచారణలో బయటపడుతుందన్నారు. ప్రభుత్వం గాని, పోలీసులు గాని ఇప్పటి వరకు ఈ విషయం చెప్పలేదని, మీడియాలో వచ్చిన కథనాల ఆధారంగా విమర్శలు చేయడం సరికాదన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *