తెలంగాణ ఎంసెట్-2 ప్రశ్నాపత్రాల లీకేజీ కేసులో మరో ఇద్దరిని సీఐడీ పోలీసులు అరెస్ట్ చేశారు. హైదరాబాద్ లోని బాచుపల్లిలో ఉంటున్న కృష్ణా జిల్లాకు చెందిన గరిమెళ్ల వీరేందర్ రావు, కోల్ కత్తాకు చెందిన మయాంక్ దళారులుగా వ్యవహరించినట్టు గుర్తించారు. వీరేందర్ ఇద్దరిని బెంగళూరు తీసుకెళ్లి లీక్ చేసిన పేపర్లను వారితో ప్రాక్టీస్ చేయించాడని నిర్ధారించారు. మయాంక్ ఎనిమిది మందిని ముంబై తీసుకెళ్లి క్యాంప్ నిర్వహించాడని, లీక్ చేసిన రెండు పేపర్ల లలోని ప్రశ్నలను వారితో ప్రాక్టీస్ చేయించాడని తేల్చారు. దీంతో, వీరిద్దనిరి అరెస్ట్ చేశారు.
ఈ కేసులో మిగతా బ్రోకర్లు, నిందితులను పట్టుకునేందుకు ముమ్మరంగా గాలిస్తున్నట్టు సీఐడీ అధికారులు తెలిపారు.
తెలంగాణ ఎంసెట్-2 కేసులో మరో ఇద్దరు అరెస్ట్




